Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ పండుగ నాడు చంద్రుడిని పూజిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (16:00 IST)
రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు వస్తుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను మహా పాల్గుణి అని, హోలికా, హోలికాదాహో (హోళీ) అనే పేర్లతో పిలుస్తుంటారు. అలాగే హుతాశనీ పూర్ణిమా, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు. 
 
హోళీ రోజున దేశంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీ నారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, చంద్రపూజ వంటివి జరుపుతుంటారు. మన రాష్ట్రంలో కాముని పున్నమిగా ప్రసిద్ధి చెందిన ఈ హోలీ పండుగ రోజు (ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ) చంద్రుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి. అందుచేత ఈ రోజున చంద్ర పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. 
 
హోలీ పండుగనాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో గడుపుతూంటారు. ఈ వేడుక రాబోయే ఆనందకర వసంత రుతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సంప్రదాయంగా పరిణమించిందని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా హోలీ పండుగ రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లో నాలుగు వీధులు కలిసే చోట పెద్ద పెద్ద భాండాలలో రంగు నీళ్లను నింపి ఉంచుతారు. ఆ నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్ద వాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబరాలను పంచిపెడుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments