Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి అంట్లు శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 7 నవంబరు 2014 (17:54 IST)
రాత్రిపూట అంట్లను శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా? అయితే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసముండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనాలు, అల్పాహారంగానీ చేసిన తర్వాత ఆ అంట్లను అలాగే వుంచేస్తుంటారు. ఉదయాన్నే శుభ్రం చేయవచ్చునని అనుకుంటారు. అయితే ఈ అలవాటు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదని.. రాత్రి వేళకి సంబంధించిన అంట్లను వెంటనే శుభ్రపరుచుకోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇంకా సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అందువలన ఈ సమయంలో వీధి తలుపులు వేయకూడదని చెబుతుంటారు. తలుపులు మూసి వుంచడం వలన, అక్కడి వరకూ వచ్చిన లక్ష్మీదేవి వెంటనే వెనుదిరుగుతుందట. లక్ష్మీదేవి అలా నడచివస్తూ తన భక్తులకి సంబంధించి ఎవరి ఇల్లు పవిత్రంగా అనిపిస్తూ వుంటుందో వాళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 
 
ఈ కారణంగానే వీధి గుమ్మం దగ్గర పాదరక్షలు ఉండకూడదని అంటారు. అలాగే రాత్రి పూట ఇల్లు ఊడ్చిన చెత్త బయట పడేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడదామని అనుకుంటూ వుండగా, ఆ సమయంలో ఇల్లు ఊడ్చిన చెత్తతో ఎదురుపడకూడదనేదే ఇందులోని ఉద్దేశమని వారు చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments