Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడు చిరంజీవి కావడంతో.. ఆయన్ని ఆరాధిస్తే..?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (19:00 IST)
హనుమంతుడు చిరంజీవి కావడంతో, హనుమ చిరంజీవి వరాన్ని పొందడం వలన.. ఆయన్ని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. అందుచేత గ్రహసంబంధమైన దోషాల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్లు, దుష్ట ప్రయోగాల వలన అవస్థలు పడుతున్న వాళ్లు హనుమంతుడిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. 
 
గ్రహ పీడలను తొలగిస్తూ ... దుష్ట ప్రయోగాలను తరిమికొట్టే హనుమంతుడి ఆలయాలు ఆయా క్షేత్రాల్లో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులను పారద్రోలే హనుమంతుడు ఒక విశిష్టమైన క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. 
 
ఆ క్షేత్రమే ... అప్పలాయగుంట ... ఇది తిరుపతి సమీపంలో విలసిల్లుతోంది. అప్పలాయగుంట అనే పేరు వినగానే పద్మావతి - గోదాదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం కనులముందు కదలాడుతుంది. ఈ క్షేత్రంలోనే హనుమంతుడి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది.
 
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం ఈ హనుమంతుడి ప్రత్యేకత. ఈ స్వామిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలను కోరుతూ మొక్కుకుంటే, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments