Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమిదలో దీప ప్రజ్వలనకు నవగ్రహాలకు సంబంధం వుందా? ఎలా?

ప్రమిదల్లో దీపమెలిగించడంలో ఎంత నిగూఢ అర్థముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని ఓ లుక్కేయండి. ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచినట్లవుతుందని.. ప్రమిద దీపం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతి

Webdunia
గురువారం, 5 జులై 2018 (17:59 IST)
ప్రమిదల్లో దీపమెలిగించడంలో ఎంత నిగూఢ అర్థముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని ఓ లుక్కేయండి. ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచినట్లవుతుందని.. ప్రమిద దీపం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆలయాల్లో, గృహాల్లో ప్రమిదలతో దీపాలు వెలిగించడం మనం చూస్తూవుంటాం. 
 
ఎంతటి సంపన్నుడైనా దేవాలయానికి వస్తే ప్రమిదలతో దీపమెలిగించాల్సిందే. ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా సుభిక్షమైన ఫలితాలను పొందవచ్చు. ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి నవగ్రహాలకు సంబంధం వుంది. ఇంకా ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని విశ్వాసం. 
 
1. ప్రమిద దీపం -సూర్యుడు 
2. నెయ్యి, నూనె- ద్రవపదార్థం - చంద్రుడు 
3. వత్తులు - బుధుడు 
4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల- అంగారకుడు 
5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది. 
6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు 
7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం 
8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం.. కేతువుకు సంకేతం
9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం. శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

అదెలాగంటే.. మానవుడు ఆశలను తగ్గించుకుంటే.. సుఖసంతోషాలు చేకూరుతాయనేందుకు ప్రమిదలో వెలిగే దీపమే నిదర్శనం. ఆశలతో మానవ జన్మ సార్థకం కాదని, తద్వారా మోక్షం లభించడం కష్టమని, తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మట్టి ప్రమిదలో మనం వెలిగించే దీపం ద్వారా తెలుసుకోవచ్చునని వారు సెలవిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు.. ఆదాయం 2, వ్యయం 14

తులారాశి 2025 రాశిఫలితాలు.. వరసిద్ధి వినాయకుని ఆరాధన చేస్తే?

తర్వాతి కథనం
Show comments