రాత్రిపూట ఇంట్లో దీపాలన్నింటినీ ఆర్పేస్తున్నారా...?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (10:53 IST)
ఇంట్లో ఎప్పుడూ ఓ నూనె దీపం వెలుగుతూ వుంటే.. అనూహ్య ఖర్చులు వుండవు. రాత్రిపూట ఇంట్లోని దీపాలన్నీ ఆర్పేయకుండా... కనీసం ఒక్క దీపాన్నైనా వెలుగుతూ వుండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే డబ్బు చేతిలో నిలుస్తుంది. అదీ నూనె దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ధనలాభం కోసం ఇంటి ప్రవేశ ద్వారం వున్న గోడకు తెలుపు, లేత నీలం, గులాబీ వంటి రంగులు వేసుకుంటే మంచిది. నలుపు, నిండు ఎరుపు రంగులు మాత్రం ఉపయోగించకూడదు. బీరువాలో డబ్బు ఉంచే లాకర్‌ను ప్రతిబింబించేలా ఒక అద్దాన్ని బీరువా తలుపు లోపలివైపు అమర్చితే ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్న కుండీ పెట్టుకొంటే డబ్బు, పెట్టుబడులకు ఎలాంటి నష్టం ఉండదు. 
 
ఇంట్లో పగిలిన గాజు వస్తువులు, కిటికీ అద్దాలు లేకుండా చూడాలి. గాజు వస్తువులను ఎప్పుటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంట్లో సూర్య కిరణాలు పడే కిటికీ వద్ద స్పటికాల మాల వేలాడదీస్తే కాంతి శక్తి తరంగాలు ఇల్లంతా ప్రవహించి ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూస్తే.. ఆదాయానికి లోటుండదు.
 
అవకాశం ఉన్నవారు ఇంట్లో ఈశాన్యాన చిన్న ఫౌంటెన్‌ పెట్టుకోవాలి. లేదా కనీసం నీరు పారే శబ్దం ఇంట్లో వచ్చేలా చూడాలి. దీనివల్ల సానుకూల శక్తి ప్రవహించి ఊహించనిరీతిలో సంపద చేరుతుందని పంచాంగ నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి మరో గొప్ప విరాళం.. రూ.9కోట్లు ఇచ్చిన అమెరికా భక్తుడు

26-11-2025 బుధవారం ఫలితాలు - రుణఒత్తిళ్లు అధికం.. రావలసిన ధనం అందదు...

కోనసీమలో సంక్రాంతి నుంచి శతాబ్ధాల నాటి జగ్గన్నతోట ప్రభల తీర్థ ఉత్సవం

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments