Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం-12 రాశుల వారు ఏం చేయాలి..? (Video)

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:31 IST)
రాశులను బట్టి శ్రావణ మాసంలో పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితుల వాక్కు. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీకే కాదు.. శివునికి కూడా శ్రావణమాసం ప్రీతికరం. అందుకే శ్రావణమాసంలో భక్తితో కొలిచేవారికి పరమేశ్వరుడు వరాల వర్షం కురిపిస్తాడు.


ఇంకా జన్మరాశులను బట్టి.. శ్రావణ మాసంలో ఈశ్వరుడినికి పూజించే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయట. అందుకే 12 రాశుల వారు శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని ఎలా పూజించాలో చెప్తున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. అదెలాగో చూద్దాం.. 
 
12 రాశుల్లో మొదటిది అయిన మేషరాశిలో జన్మించిన జాతకులు శ్రావణమాసంలో మహేశ్వరుడిని, శ్రీలక్ష్మిని, మహావిష్ణువును నిష్ఠతో పూజించాలి. ముఖ్యంగా ఈశ్వరుడికి ఆవు పాలు, పెరుగుతో అభిషేకం చేయించాలి. ఉమ్మెత్తు పుష్పాలను సమర్పించి పూజించాలి. కర్పూర హారతిని మరిచిపోకూడదు. 
 
ఇక వృషభ రాశి జాతకులు శ్రావణంలో శివలింగానికి ప్రదోషకాలంలో మాస శివరాత్రి పూట చెరుకు రసంతో అభిషేకం, మల్లె సువాసన గల అగరువత్తులను వెలిగించాలి. నైవేద్యంగా స్వీట్లు సమర్పించి, చివరిలో కర్పూర నీరాజనం ఇవ్వడం చేస్తే అభీష్టాలు నెరవేరుతాయి. 
 
ఇక పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర, మిథున రాశికి చెందిన వారు.. స్పటిక లింగాన్ని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఇది అందుబాటులో లేకపోతే ఏదైనా లింగానికి చందనం, కుంకుమతో పూజచేస్తే ఫలితం ఉంటుంది.
 
కర్కాటక రాశి ఏం చేయాలంటే.. చందనంతో శివుడిని అభిషేకించాలి. పూర్తిగా గోధుమపిండితో చేసిన చపాతీలు, రేగుపండ్లు నైవైద్యంగా సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయి. సకలసంతోషాలు చేకూరుతాయి. 
 
ఇకపోతే.. సింహరాశి జాతకులు.. పండ్ల రసానికి నీరు, చక్కెర కలిపి శివలింగానికి అభిషేకం చేయించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. శివాలయాల్లో ప్రదోషకాలంలో లేదా సోమవారం పూట ఈ అభిషేకాలు చేయించే వారికి సంపదలు చేకూరుతాయి. ఇంకా జిల్లేడుపూలతో మాలను తయారుచేసి శివుడికి వేయాలి. స్వీట్లు సమర్పించాలి. 
 
అలాగే కన్యారాశి జాతకులు శ్రావణమాసంలో రేగు పండ్లు, జిల్లేడు పువ్వులు, మారేడు దళాలతో శివుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా కర్పూరాన్ని నీటితో కలిపి శివలింగానికి అభిషేకం చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. 
 
తులారాశి వారు బిల్వ పత్రాలు, మల్లెలు, గులాబీ, చందనం, బియ్యం నీటిలో కలిపి లింగానికి అభిషేకం చేయాలి. 
 
వృశ్చిక రాశి జాతకులైతే.. స్వచ్ఛమైన జలంతో లింగాన్ని శుద్ధిచేసి, వెన్న లేదా ఆవు నేయిలో తేనె కలిపి అభిషేకించాలి. ఆ తర్వాత మళ్లీ నీటితో శుద్ధిచేసి, హరతి వెలిగించాలి. 
 
ధనుస్సు రాశి జాతకులు శ్రావణ మాసంలో ఎండు ఫలాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. గులాబీలు, బిల్వ పత్రాలతో ఈ రాశి వారు అభిషేకం చేస్తే చాలా శుభం జరుగుతుంది. 
 
మకర రాశి జాతకులు పాలతో శివలింగానికి అభిషేకం చేయించి..గోధుమలతో శివలింగాన్ని కప్పి పూజించాలి. అలాగే వీటిని దానం చేస్తే అన్ని సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుంభ రాశి జాతకులు తెలుపు, నల్ల నువ్వులను కలిపి శివలింగంపై వేయాలి. నీటితో లింగాన్ని శుద్ధిచేసి నువ్వులతో అభిషేకం చేయాలి. ఇలాచేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయి. 
 
మీన రాశి వారైతే.. శివలింగానికి పన్నీరుతో అభిషేకం చేయించడం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఇంకా రావి చెట్టు కింద ఉండే శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం నమ:శివాయ మంత్రాన్ని ఉచ్చరించాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ పూర్తిచేయాలి. 
 
ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారాల్లో, ప్రదోష సమయాల్లో, మాస శివరాత్రి పూట చేయించిన వారికి దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. ఇంకా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-02- 2025 గురువారం రాశి ఫలాలు : రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు...

సిరుల తల్లి శ్రీలక్ష్మి ఆశీస్సుల కోసం వంటగదిలోని ఈ పదార్థాలను వాడితే?

టీటీడీ సంచలన నిర్ణయం- 18మంది హిందూయేతర ఉద్యోగులపై బదిలీ వేటు

బుధాష్టమి, దుర్గాష్టమి, భీష్మాష్టమి.. కాలభైరవ అష్టకాన్ని చదివితే?

05-02- 2025 బుధవారం దినఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments