Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ పౌర్ణిమ.. పెరుగన్నం నైవేద్యం.. చంద్రుడిని చూస్తే..?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (17:07 IST)
ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమకు ప్రత్యేకత వుంది. ఈ పౌర్ణమి రోజున శివపూజ, లక్ష్మీదేవి పూజతో విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ ఏడాది ఈ పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీన శనివారం వస్తోంది. ఈ రోజున చంద్రుని అనుగ్రహం కోసం రవ్వ లడ్డూలను, పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజున చంద్ర పూజతో భక్తులకు అమృతవర్షం కురుస్తుందని భక్తుల విశ్వాసం. 
 
ఆశ్వయుజ మాసంలోని వచ్చే పూర్ణిమను శరత్ పూర్ణిమ అంటారు. అంతేకాకుండా.. ఇదే రోజునే లక్ష్మీదేవి సాగర మథనం నుంచి ఉద్భవించిందని.. అందుకే ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆమెను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే విష్ణు పూజ కూడా చేస్తే సకల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంతేగాకుండా.. ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజున అమ్మవారిని కూడా పూజించవచ్చు. ఈ రోజున లక్ష్మీపూజ, లక్ష్మీ మంత్ర పఠనం శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
చంద్రుడు శ్రీలక్ష్మికి సోదరుడని.. శరత్ పూర్ణిమ రోజున మాత్రమే 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి వుంటుందట. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తుందని విశ్వాసం. 
 
వెన్నెలకు పెట్టే పెరుగన్నం చంద్రకిరణాల్లో వున్న ఔషధాన్ని స్వీకరిస్తుంది. దానిని మనం తీసుకున్నప్పుడు శరీరంలోని వ్యాధులు దూరం అవుతాయి. అలాగే శరత్ పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగు అవుతుంది. ఈ పౌర్ణమి రోజున రాత్రి లక్ష్మీ పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments