Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిదోషాలకు అయ్యప్ప స్వామి, ఆంజనేయుడిని ప్రార్థించండి!

Webdunia
మంగళవారం, 24 మే 2016 (17:28 IST)
శనిదోషాలు తొలగిపోవాలంటే..? శనివారాల్లో అయ్యప్ప స్వామిని, ఆంజనేయస్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా శనిదోషాలు దరిచేరవని, అలాగే మహావిష్ణువు, శివుడి స్వరూపమైన అయ్యప్ప స్వామిని కొలిచే వారికి సైతం శనిదోషాలతో ఏర్పడే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం ఉండబోదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, శుచిగా స్నానమాచరించి విభూతి ధరించి దేవుడిని ప్రార్థించడం ద్వారా సంకల్పసిద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుడిని, సంపదకు శ్రీ మహాలక్ష్మీ, శ్రీ నారాయణ స్వామిని పూజించాలి. 
 
ఇంకా ఏ దేవతలను పూజిస్తే ఎలాంటి సమస్యలు తొలగిపోతాయంటే..?
* వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే- శ్రీ ధన్వంత్రీ, దక్షిణామూర్తిని పూజించాలి. 
* గృహం, భూమిని కొనాలంటే- శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అంగారకుడిని పూజించాలి. 
* ఆయురారోగ్యాల కోసం - రుద్రుడిని పూజించాలి.
* మానసిక బలం, శరీర దృఢత్వం కోసం - రాజరాజేశ్వరి, శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. 
* విద్యారంగంలో రాణించాలంటే - శ్రీ సరస్వతీ దేవిని కొలవాలి
* వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే - శ్రీ కామాక్షీ దేవిని, దుర్గాదేవిని పూజించాలి.
* మాంగల్య దోషాలు తొలగిపోవాలంటే.. దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కోసం - మంగళగౌరీ దేవిని స్తుతించాలి
* సంతాన ప్రాప్తి కోసం - సంతాన కృష్ణ, సంతాన లక్ష్మిని పూజించాలి.
* వ్యాపారంలో లాభం కోసం- తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభం. 
*  కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే - శ్రీ గజలక్ష్మిని.. 
* వ్యవసాయంలో వృద్ధి చెందాలంటే - శ్రీ ధాన్యలక్ష్మిని.. 
* దారిద్ర్యం తొలగిపోవాలంటే - శ్రీ అన్నపూర్ణా దేవిని 
* కోర్టు వ్యవహారాల్లో విజయం కోసం - వినాయక స్వామిని 
* శని దోషాల నివృతి కోసం - శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ ఆంజనేయ స్వామిని 
* శత్రుబాధలు తొలగిపోవాలంటే.. తిరుచ్చందూరు కుమారస్వామిని పూజించడం ఉత్తమం. 
* మంత్రశక్తులు, దుష్ట శక్తుల నుంచి విముక్తి కోసం.. శ్రీ వీరమాకాళి, శ్రీ నరసింహ స్వామిని పూజించాలి. 
* తరగని సంపదన, జ్ఞానం, శక్తి పొందాలంటే.. శివస్తుతి తప్పనిసరి అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments