Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక శని ప్రదోషం.. ఉప్పు, కారం, పులుపు తీసుకోకుండా.. పంచాక్షరీ మంత్రంతో..?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (19:32 IST)
శని ప్రదోషం రోజున నందీశ్వరునికి గరిక సమర్పించడం ఉత్తమం. బిల్వ పత్రాలతో కూడిన మాలను సమర్పించవచ్చు. అలాగే నేతి దీపం వెలిగించి.. బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
శని ప్రదోషం రోజున శివాలయాన్ని నిష్ఠతో ప్రదక్షణలు చేయాలి. ఆ రోజున శివాలయాన్ని చేసే ప్రదక్షణను సోమసూక్త ప్రదక్షణం అని పిలుస్తారు. శని ప్రదోష కాలంలో శివునిని దర్శించుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. పాపాలు హరించుకుపోతాయి. పుణ్య ఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున చేసే దానాలు అమితమైన ఫలితాలను ఇస్తాయి. మరో జన్మంటూ లేని ముక్తిని ప్రసాదిస్తుంది. 
 
శని ప్రదోష సమయంలో సమస్త దేవతలు.. నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలను విచ్చేస్తారని విశ్వాసం. ఈ కాలంలో శివునిని ఆరాధిస్తే.. సమస్త దేవతలను ఆరాధించినట్లే. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు. అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. 
Lord shiva
 
ప్రదోష కాలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పితృదేవలు, ఏడు తరాల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయి. అలాగే శని ప్రదోషం రోజున ఉపవసించి.. ఉప్పు, కారం, పులుపు తీసుకోకుండా వుండాలి. సాయంత్రం ప్రదోష కాల పూజను ముగించి.. ఉపవాసాన్ని పూర్తి చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్‌ను చంపేందుకు స్కెచ్ .. ఆ పెద్దలు ఎవరో తెలాలి?: రాజేంద్ర ప్రసాద్ (Video)

ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments