Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం రాగానే.. ఏం చేయాలంటే..? శుక్రవారం పూట ఉప్పు కొనాలట..

మీకు నెల జీతం అందగానే వెంట వెంటనే ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. జీతం చేతికి అందగానే మీరు చేయాల్సింది ఒకటుంది.. అదేంటంటే..? ఇంట్లో సాధారణ ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతినెల వస్తూనే వుం

Webdunia
మంగళవారం, 9 మే 2017 (12:37 IST)
మీకు నెల జీతం అందగానే వెంట వెంటనే ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. జీతం చేతికి అందగానే మీరు చేయాల్సింది ఒకటుంది.. అదేంటంటే..? ఇంట్లో సాధారణ ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతినెల వస్తూనే వుంటాయి. దీనివల్ల ధనం నష్టపోవడమే కాకుండా ఇంట్లో ఆర్థిక చికాకులు వస్తుంటాయి. ఇందుకు కారణం ఇంట్లోని ప్రతికూలమైన వాతావరణం అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అందుచేత ఇంట్లో ఉండే ప్రతికూలమైన వాతావరణాన్ని తరిమికొట్టాలి. అందుకు ఏం చేయాలంటే? నెలజీతం చేతికి అందగానే ఆ ఇంటి స్త్రీలు తొలుత ఉప్పు కొనాలట. కానీ శనివారం మాత్రం ఉప్పు కొనకూడదట. శుక్రవారం పూట ఉప్పు కొనడం ద్వారా పై ఖర్చులు తగ్గుతాయని పండితులు అంటున్నారు. 
 
ఇంట్లో చీటికిమాటికి గొడవలు అవుతూ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా లేకపోతే.. ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వెయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లోపిస్తే కొద్దిగా నీటిలో రాళ్ళ ఉప్పు వేసి పాదాలను నానబెట్టి ఉంచాలి. లేకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటే ఓ గ్లాసుడు నీళ్లతో పరిష్కరించుకోవచ్చునట. నీటి ద్వారా ఇంట్లోని ప్రతికూల ప్రభావాన్ని గుర్తించడం తేలికేనని పండితులు అంటున్నారు. అదెలాగంటే..? క్లీన్‌గా క్లియర్‌గా ఉన్న గ్లాసును తీసుకోవాలి. గీతలు లేని పెయింటింగ్‌గాని లేని, ఫింగర్ ప్రింట్స్ లేని గ్లాసును తీసుకోవాలి. ఒకసారి ఉపయోగించిన ఈ గ్లాసును మరోసారి ఉపయోగించకూడదు.
 
ఇలా పారదర్శకంగా ఉండే గాజు గ్లాసులో ఒకటి బై మూడో వంతు సీ సాల్ట్ వేయాలి. తర్వాత అందులోనే వెనిగర్ వేయాలి. 2/3 భాగాలు వేయాలి. నీళ్లు జోడించాలి. నిదానంగా పోయాలి. సైడ్ నుంచి పోయాలి. గ్లాసులో ఉన్న ఉప్పు, వెనిగర్ పదార్థాలు కదలకుండా నీటిని నింపి.. ఇంట్లో ఏ చోట ప్రతికూల శక్తులున్నాయని భావిస్తున్నారో ఆ చోట ఈ నీటి సీసాను ఉంచాలి. ఈ గ్లాసును ఎవరికి తెలియకుండా ఉంచాలి. 
 
24 గంటల తర్వాత ఈ నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్లే. కానీ ఆ గ్లాసులోని నీరు గ్రీన్, గ్రే కలర్‌లో మారితే మాత్రం ప్రతికూల శక్తులున్నట్లు గ్రహించాలి. ఆ నీటిని బాత్రూమ్‌లో పారబోసి గ్లాసును క్లీన్ చేయాలి. ఇలా ఐదు ఆరుసార్లు చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments