Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 29 నుంచి మే 5, 2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మేషంలో రవి, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, కుజులు, మకరంలో కేతువు. మీనంలో బుధుడు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 29న అన్నమాచార్య జయంతి, 3 సంకటహర చతుర్ధి, 4వ తేది నుంచి డొల్లుకర్తెరి ప్రారంభం. ము

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (21:29 IST)
మేషంలో రవి, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, కుజులు, మకరంలో కేతువు. మీనంలో బుధుడు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 29న అన్నమాచార్య జయంతి, 3 సంకటహర చతుర్ధి, 4వ తేది నుంచి డొల్లుకర్తెరి ప్రారంభం. ముఖ్యమైన పనులకు విదియ, బుధవారం అనుకూలం. 2న కుజుడు మకర ప్రవేశం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొంత మెుత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఒక సమస్య సానుకూలమవుతుంది. తీవ్రంగా వివాహ యత్నాలు సాగిస్తారు. మంగళ, శని వారాల్లో పనులు ఒక పట్టాన పూర్తి కావు. అధికారుల ఇటర్వ్యూకోసం నిరీక్షిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. బెట్టింగులు, పందాల జోలికి పోవద్దు.
 
వృషభం: కృత్తిక 2, 3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సంతానం ద్వారా శుభవార్త వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మంగళ, శని వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ శ్రీమతి సాయం అందుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడొద్దు. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెద్దల సలహా పాటించండి. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణులు, మరమ్మతులు చేపడతారు. పనుల ప్రారంభంలో మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు సామాన్యం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యవహరాల్లో ప్రతికూలతలుంటాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. శనివారం నాడు మాటతీరు అదుపులో ఉంచుకోవాలి. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు తప్పకపోవచ్చు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. వేడుకలు, ప్రయాణాలకు సన్నాహాలు సాగిస్తారు. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వారం కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలి వారి ఆంతర్యం గ్రహించండి. ఫోన్ సందేశాలు విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహంలో మార్పులు చేపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిగిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. అయినవారి రాక సంతోషాన్నిస్తుంది. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. సేవా, సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
బాధ్యతల నుంచి విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. దళారులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దైవకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
పదవుల స్వీకరణకు అనుకూలం. పరిచయాలు బలపడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆది, సోమ వారాల్లో సాధ్యం కాని హామీలివ్వవవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. శుభకార్యాలకు హాజరవుతారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. కొంత మెుత్తం ధనం అందుతుంది. పెట్టుబడులకు అనుకూలం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో సమస్యలు సర్దుకుంటాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వేడుకలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వివాహయత్నం ఫలిస్తుంది. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులెదుర్కుంటారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. నగదు, విలువైన వస్తువులు, జాగ్రత్త. ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలించవు. చాకచక్యంగా వ్యవహరించాలి. మీ శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. గురు, శుక్ర వారాల్లో ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ఆరోగ్య సమస్యలెదురవుతాయి. ఆప్తుల సాయం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు చికాకులు అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. దైవకార్యాలకు సాయం అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. పదోన్నతి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహంలో మార్పులకు అనుకూలం. కొత్త పథకాలు రూపొందిస్తారు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పదవులకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆధిపత్యం ప్రదర్శిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. ఆది, సోమ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. సభలు, సమావేశల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత ఉన్నాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆర్థికంగా బాగుంటుంది. రుణ యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 

వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments