Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 21-10-17

మేషం : టెక్నికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగానూ, ఉత్సాహంగానూ గడుపుతారు. అందరితో కలిసి విందువి

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (05:39 IST)
మేషం : టెక్నికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగానూ, ఉత్సాహంగానూ గడుపుతారు. అందరితో కలిసి విందువినోదాలో పాల్గొంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. 
 
వృషభం : ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోగలవు. ఒకదైవకార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. 
 
మిథునం : పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. వ్యవహార ఒప్పందాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోనివారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం. బంధు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరికైనా ధనం సహాయం చేసినా తిరిగి రాజాలదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
సింహం : ఇంటా బయటా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : చిన్న తప్పిదాలే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. వృత్తిపరమైన సంబంధాలు బలపపడతాయి. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. సావకాశంగా ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : దైవ, సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. గత సంఘటనలు, అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవులు మంజూరవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. 
 
వృశ్చికం : కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. వాస్తు మార్పు వల్ల వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు : మీ శ్రీమతిని సలహా అడగటం శ్రేయస్కరం. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు అధికమవుతున్నాయి. 
 
మకరం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కుంభం : రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో అంత సఖ్యత ఉండదు. మీ సంతానం మొండివైఖరి చికాకులు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలవ్యాపారులకు కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
మీనం : స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. పాత రుణాలు చెల్లించుడంతో పాటు తాకట్టును విడిపించుకుంటారు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments