Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు మాసంలో మీ రాశి ఫలితాలేంటి?... ఖర్చులు అధికం... అన్ని రంగాల వారికి యోగం!

11వ తేదీ గురువు కన్య ప్రవేశం. 12వ తేదీ నుండి కృష్ణా పుష్కరాలు ప్రారంభం. 13వ తేదీ శనికి వక్రత్యాగం. 16వ తేదీ రవి సింహం నందు. 19న తేదీ బుధుడు కన్యయందు. 25వ తేదీ శుక్రుడు కన్యయందు ప్రవేశం. 30వ తేదీ నుండ

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (08:22 IST)
11వ తేదీ గురువు కన్య ప్రవేశం. 12వ తేదీ నుండి కృష్ణా పుష్కరాలు ప్రారంభం. 13వ తేదీ శనికి వక్రత్యాగం. 16వ తేదీ రవి సింహం నందు. 19న తేదీ బుధుడు కన్యయందు. 25వ తేదీ శుక్రుడు  కన్యయందు ప్రవేశం. 30వ తేదీ నుండి బుధునికి వక్రం ప్రారంభం. 
 
1వ తేదీ మాసశివరాత్రి. 6వ తేదీ దుర్గాగణపతివ్రతం. 7వ తేదీ నాగపంచమి. 9వ తేదీ మంగళగౌరీ వ్రత. 12వ తేదీ వరలక్ష్మీవ్రతం. 18వ తేదీ శ్రావణపూర్ణిమ, హయగ్రీవ జయంతి. 21వ తేదీ సంకటహరచతుర్థి. 25వ తేదీ కృష్ణాష్ణమి. నిత్యవసర వస్తువుల ధరలు అధికమవుతాయి. 
 
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. నిరుద్యోగుల యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ దర్శనాలు పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. పెద్దల మాటకు గౌరవం లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. రుణ సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ధనప్రాప్తి. వ్యవహారాలు మీ చేతిల మీదుగా సాగుతాయి. తొందరపడి హమీలివ్వొద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసలందుకుంటారు. ఈ రాశివారు చామంతులతో అమ్మవారిని పూజించిన శుభం. జయం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. ఆహ్వానం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలు నుంచి బయటపడే సూచనలున్నాయి. మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలతకు మరింతగా శ్రమించాలి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుంది. దైవదర్శనాలు, పుణ్యనదీ స్నానాల్లో ఒకింత ప్రయాసలెదుర్కొంటారు. సంకల్పసిద్ధికి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2 3, పాదాలు 
వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ధిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చెక్కుల జారీలో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణం కలిసివస్తుంది. తెల్లని పూలు, మల్లెలతో అమ్మవారి అర్చన శుభదాయకం. 
 
కర్కాటకం : పునర్వుసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఈ మాసం శుభదాయకమే. సంబంధాలు, బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఒక సమాచారం ఉత్సాహన్నిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి. వస్తులాభం. వాహన యోగం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దైవ కార్యాలు, పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల మానసిక సంతృప్తి పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఒప్పందాలు, బయటి చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విశ్రాంత ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. తెల్ల చామంతులతో అమ్మవారికి అర్చన ఈ రాశి స్త్రీలకు శుభదాయకం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసం అనుకూల ప్రతికూలతల సమ్మేళనం. బంధుమిత్రులతో కలహాలు, గృహంలో చికాకులు అధికం. అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. దైవదర్శనాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కలువపూలతో అమ్మవారి అర్చన ఈ రాశి వారికి శుభదాయకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు 
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ప్రతి వ్యవహారం ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కొన్ని అవసరాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వస్త్ర బంగారం, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యస్నాలు, దైవదర్శనాల్లో చికాకులెదుర్కొంటారు. సంకల్ప సిద్ధికి అమ్మవారిని మందార పుష్పాలతో పూజించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశఖ 1, 2, 3 పాదాలు 
ఈ మాసం అన్ని రాశుల వారికి అనుకూలం. ఖర్చులు పెరిగినా ధనానకి లోటుండదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వేడుకలు, శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం వాహనయోగం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞులు సలహా పాటించండి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యనదీస్నానాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. తెల్లని పూలు, చామంతులతో అర్చన స్త్రీలకు శుభదాయకం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జేష్ట్యం 
నిర్ధిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పొగడ్తలు, మొహమ్మాటాలకు లొంగవద్దు. ఆర్థిక పరిస్థితులు చక్కబడుతాయి. శుభవార్తలు వింటారు. అవసరాలకు ధనం అందుతుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక బంధువులకు సంతోషానిస్తుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలు, నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, పుణ్యస్నాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. దేవగన్నేరు, నీలి శంకు పూలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అన్ని రాశుల వారికి ఆశాజనకమే. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో సందడి నెలకొంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థికంగా బాగుటుంది. రుణ విముక్తి, కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులు ధన సహాయం ఆర్థిస్తారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. వస్త్ర, బంగారం, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. దైవ పుణ్యకార్యాలకు సహాయం అందిస్తారు. సంకల్ప సిద్ధికి ఎర్ర మందారం, గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి. 
 
మకరం : ఉత్తరాషా 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడటం కష్టమే. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. యత్నాలు ఫలించక, అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. కుటుంబీకుల మీ ఆశక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. నదీ స్నానాలు, సేవా కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు చికాకులు అధికం. అధికారులకు హోదా, మార్పు, స్థానచలనం సంభవం. తెల్ల చామంతులు, గరుడవర్థని పూలతో అమ్మవారి అర్చన శుభదాయకం. 
 
ధనిష్ట 3, 4 పాదాలు, శతబిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. అయినవారే సాయం చేసేందుకు సందేహిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం అందుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. కళాకారులకు ప్రోత్సాహకరం. పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. కార్యసాధనకు చామంతులు, పసుపు పచ్చ పూలతో అమ్మవారిని అర్చించండి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. శుభకార్యాల్లో విలువైన కానుకలు అందిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వస్త్ర, బంగారం, పచారీ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పదు. ఎర్ర మందారం, గులాబీలతో అమ్మవారి అర్చన కలిసివస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments