Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే...

మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం... స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (16:05 IST)
మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం... స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. 
 
అలాగే స్త్రీలకు చేతిపైన గాని, నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. 
 
ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. 
 
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం  గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments