Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి పుట్టుమచ్చలుంటే మహిళలకు మంచిది?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (22:15 IST)
శరీరంపై పుట్టుమచ్చల గురించి శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా శరీరంలో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పుట్టుమచ్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు.
 
అలాగే స్త్రీలకు చేతిపైన గాని, నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి.
 
ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు.
 
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
 
గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments