Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథున రాశి 2019.... మీ ఆదాయం బాగానే వున్నప్పటికీ...(Video)

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (21:17 IST)
మిధునరాశి: ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా 'గౌరవమ్ లభ్యతే దానాత్' అన్నట్లుగా దానధర్మాలు చేయడం వలన బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికి ఆర్థిక వ్యవహారాల యందు సరైన ప్రణాళికలు వేయలేక వృధా ఖర్చును అదుపు చేయలేక విఫలమవుతారు.

కొన్నికొన్ని చోట్ల ధన విషయంగా, సహకార విషయంగా మోసపూరిత వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి. జన్మరాహులక్షణం వలన భార్యాపుత్ర విరోధన కలుగుచేయడం ప్రతి అంశంలోను కలహాములు, కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగ వ్యవరారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికి ప్రమోషన్స్, గుర్తింపు, గౌరవం పొందుతారు. 
 
విద్యార్థులకు బుద్ధి స్థిరత్వం చాలా తక్కువగా ఉంటాయి. ఇతర క్రీడాలు, వ్యాసాంగాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన అనుకున్నదానికన్నా తక్కువ ఫలితాలు పొందే సూచనలున్నాయి. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు తీవ్రతరమవుతాయి. ఏదైనా చిన్న ఉద్యోగంలోనైనా స్థిరపడే యత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోను ఆలస్యం చోటుచేసుకుంటుంది. మీరు శ్రమించి త్వరగా కార్యం పూర్తి చేయాలన్న ఆ పనికి సంబంధించిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు కలిసిరాగలదు. స్థిర, చరాస్తులను అభివృద్ధి చేసే ఆలోచనులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఈ విషయంలో ఎవరినీ నమ్మకుండా స్వనిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం దానిని పక్కన పెట్టి ముందుకు పోయే అలోచనలు చేస్తారు. 
 
విదేశీయాన యత్నాల్లో అధిక ధనవ్యయం, కాల వ్యయం తప్పదు. అధిక కృషి అనంతరం సత్ఫలితాలు పొందుతారు. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఆరోగ్యం ఏ మాత్రం సహకరించదు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లో వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితులకు శుభసమయం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమవుతుంది. హామీలకు, చెల్లింపులకు దూరంగా ఉండటం మంచిది. సినీ, కళా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణం, పుణ్యక్షేత్రాల దర్శన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 
విలువైన వస్తు, వాహనాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉన్నప్పటికి వారి సేవలకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వ్యవసాయ రంగాల్లో వారికి శ్రమ పొందటమే కాకుండా నకిలీ వస్తువుల వినియోగం వంటివి కూడా జరిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టైతే అనుకున్న ఫలసాయం పొందుతారు, షేర్ మార్కెట్ రంగాల్లో వారికి కలిగిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి శుభకాలం. ప్రతీ అంశాన్ని స్వయంగా చూసుకోవడం మంచిది. ముఖ్య విషయాల పట్ల ఏకాగ్రత వహించి, నిరుత్సాహం, నిర్లిప్తత వదిలి ముందుకు సాగిన ఈ సంవత్సరం ఈ రాశివారి సత్ఫలితాలు పొందవచ్చు.
 
* ఈ రాశివారు పంచముఖ ఆంజనేయునికి తమలపాకులతో పూజించడం వలన సర్వదా అభివృద్ధి కానవస్తుంది. 
* మృగశిర నక్షత్రం వారు మారేడు, ఆరుద్ర నక్షత్రం వారు చింత, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు, మొక్కను దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటిన మీకు పురోభివృద్ధి కానవస్తుంది.   
* మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్రగోమేధికం, పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేకా వైక్రాంతమణి అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments