Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్కాటక రాశిలో జన్మించినట్లైతే.. ఇలా వుంటారు!

Webdunia
శనివారం, 5 జులై 2014 (16:57 IST)
కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ, పురుష జాతకులు అపారమైన మేధాశక్తిని కలిగి ఉంటారని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. వీరిలో కర్కాటక రాశికి చెందిన పురుషులు బాధ్యతాయుతమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. పట్టుదల, కృషి చేసేవారుగాను ప్రకృతి ఆరాధకులుగాను ఉంటారు. సంబంధ, బాంధవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని వారుగా ఉంటారు.
 
సంగీత ప్రేమికులుగా ఉండడం వల్ల వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. సత్యాన్ని తెలుసుకొని తదనుగుణంగా తమ సంబంధాలు కొనసాగిస్తారు. వారికి అప్పగించిన పనులకు పూర్తి న్యాయం చేస్తారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భావించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
 
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేవారుగానూ, అనుకున్నది సాధించేవరకూ విశ్రమించనివారుగానూ ఉంటారు. వీరి స్ధిరత్వం లేని మనస్తత్వం వల్ల వీరి చుట్టుపక్కలవారు కాస్తంత తికమక పడక తప్పదు. తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు. వీరు అపారమైన మేధస్సును కలిగి ఉంటారు కనుక అందరికీ వీరు మార్గదర్శకులుగా ఉంటారు.
 
కర్కాటక రాశిలో జన్మించిన మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహించటం తోటిదే లోకంగా ఉంటారు. అంతేకాదు కుటుంబంలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా వారకి రక్షణగా నిలుస్తారు. శ్రమశీలిగాను, ఆత్మవిశ్వాసం కలవారుగాను మిత వ్యయకారిగానూ ఉంటారు. కళలను ఆరాధించగల స్వభావాన్ని కర్కాటకరాశి స్త్రీలలో చూడవచ్చు. సంబంధ బాంధవ్యాలను పటిష్టపరచుకోవటం ద్వారా అందరికీ అత్యంత సన్నిహితులుగా మెలగుతారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments