Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాన్ని ఎలా తింటే దరిద్రం పట్టుకుంటుందో తెలుసా?

భోజనం చాలామంది ఇష్టం వచ్చినట్లు తింటుంటారు. కొంతమంది నిలబడి తింటారు. మరికొంతమంది కుర్చీల్లో కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఐతే భోజనం చేసే కంచం ఛాతీ పైగానికంటే ఎత్తుగా పెట్టుకుని తినరాదు. అలాగే కొంతమంది అన్నాన్ని, కూరను లేదా పెరుగున

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (15:00 IST)
భోజనం చాలామంది ఇష్టం వచ్చినట్లు తింటుంటారు. కొంతమంది నిలబడి తింటారు. మరికొంతమంది కుర్చీల్లో కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఐతే భోజనం చేసే కంచం ఛాతీ పైగానికంటే ఎత్తుగా పెట్టుకుని తినరాదు. అలాగే కొంతమంది అన్నాన్ని, కూరను లేదా పెరుగుని కలుపుకుని గట్టిగా పిసికేస్తుంటారు. అది చేతి వేళ్ల మధ్య నుంచి బయటకు వస్తుంటుంది. అలా కలిపి తినడం కూడా దరిద్రానికి హేతువు. 
 
అన్నాన్ని అరచేయి మొత్తం తగిలేలా కాకుండా, అలాగని మునివేళ్లతోనూ కాకుండా మధ్యస్తంగా చేయిని పెట్టి చక్కగా భోజనం చేయాలి. కొందరు అన్న ముద్దలను బఠాణీలు విసురుకున్నట్లు నోట్లోకి విసురుకుంటుంటారు. అది కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలా చేయకూడదు. ఇంకొందరు అన్నం తింటూనే మధ్యలో చేతికి అంటిన అన్నాన్ని వదిలించుకునేందుకు అరచేతిని కంచానికి గీకుతుంటారు, అది దరిద్రానికి హేతువు. 
 
అంతేకాదు భోజనం చేసిన కంచంలోనే చేతిని కడిగేసుకోవడం, దరిద్రానికే హేతువు. భోజనం చేసేటపుడు నీళ్ల గ్లాసును కుడిచేతి వైపు పెట్టుకోరాదు. ఎడమ వైపు పెట్టుకోవాలి. కొందరు భోజనం చేస్తుండగానే ఎవరో వచ్చారని గబుక్కున ఎంగిలి చేత్తోనే లేచి వెళతారు. అలా లేవకూడదు. ఒక్కసారి భోజనం దగ్గర్నుంచి లేస్తే ఇక ఆరోజు చేయరాదని శాస్త్రం చెపుతుంది. కనుక భోజనాన్ని కూర్చుని శ్రద్ధగా చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments