Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది హస్త నక్షత్రమా? ప్రేమ వివాహాలపై మక్కువ చూపుతారట!

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (18:39 IST)
చంద్రగ్రహ నక్షత్రమైన హస్తనక్షత్రంలో పుట్టిన జాతకులు ఇతరులను తమ అందచందాలతో ఆకట్టుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందంతో పాటు గుణంలోనూ ఇతరులను ఆకర్షించే ఈ జాతకులు ఎదుటివారి కష్ట సుఖాలను తేలికగా అర్థం చేసుకుంటారు. అలాగే ఎదుటివారి అడగకుండానే సహాయం చేస్తారు.
 
ఇంకా సహోదరి పట్ల మంచి అభిమానం కలిగి ఉండే హస్త నక్షత్ర జాతకులు ఇష్టమైన విద్యను చదువుకుంటారు. అయితే బంధువుల వల్ల కొన్ని అపోహలు ఎదురవుతాయి. వంశాభివృద్ది, కీర్తి ప్రతిష్టలు వీరి వెన్నంటే ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉన్నత భావాలు కలిగిన మంచి మిత్రబృందం, ఆత్మీయవర్గం ఈ జాతకులకు లభిస్తుంది. 
 
అయితే హస్త నక్షత్ర జాతకులు ప్రేమ వివాహాలు చేసుకోవడంలో మక్కువ చూపుతారు. రహస్యాలను దాచడంలో నైపుణ్యం కలిగిన వీరు అందులోని లోతుపాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 
 
తల్లిదండ్రులకు, పెద్దలకు గౌరవం ఇచ్చే వీరి వైవాహిక జీవితం సర్దుకుపోవడం వల్ల సజావుగా నడుస్తుంది. చేసిన తప్పును బేషరతుగా ఒప్పుకునే ఈ హస్త నక్షత్ర జాతకులు తమ వ్యాపారాలను స్వంత తెలివి తేటలతో అభివృద్ధి చేస్తారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.
 
ఇకపోతే.. హస్త నక్షత్ర జాతకులకు పచ్చ, ఆరంజ్, తెలుపు రంగులు కలిసొస్తాయి. అలాగే ఎప్పుడు పచ్చరంగు చేతి రుమాలు వాడితే అభివృద్ధి ఉంటుంది. అలాగే పసుపు, పచ్చ రంగులు కలిసి ఉండే దుస్తులను ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
ఇంకా ఈ హస్త నక్షత్ర జాతకులు అదృష్టమైన సంఖ్య: 5. అలాగే 1, 4, 6, 7, 5, 13, 23, 32, 41, 50, 59 వంటి సంఖ్యలు వీరికి అన్ని విధాలా సహకరిస్తాయి. అయితే 2, 3, 8, 9 అనే సంఖ్యలు వీరికి ఏ మాత్రం కలిసిరావు. అలాగే బుధవారం వీరికి కలిసొస్తుంది. బుధవారం ఎలాంటి శుభకార్యాన్నైనా ప్రారంభించడం చేయవచ్చు. అలాగే శని, శుక్రవారం ఈ హస్త నక్షత్ర జాతకులకు సామాన్య ఫలితాలనిస్తుంది. 
 
కానీ మంగళవారం ఈ జాతకులు ఏ మాత్రం కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments