Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 రాశుల జాతకులు చేయాల్సిన దానాలు.. పేదలకు సాంబార్ అన్నాన్ని దానం చేస్తే?

మేష రాశి జాతకులు కులదైవాన్ని పూజించడం ఆపకూడదు. శివుని ఆలయాలకు వెళ్ళి.. తిరిగి వచ్చేటప్పుడు ఆలయ ద్వారాల వద్ద కూర్చుని వుండే పేదలకు చేతనైనా దానం చేయాలి. ఐశ్వర్యవంతులు కావాలనుకునే మేషరాశి జాతకులు వికలాంగ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (15:14 IST)
12 రాశుల్లో జన్మించిన జాతకులు దానధర్మాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. దానాలు చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని వారు అంటున్నారు. అయితే 12 రాశులు.. ఆ రాశిలో జన్మించిన జాతకులు ఎలాంటి దానాలు చేయాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. 
 
మేషం : మేష రాశి జాతకులు కులదైవాన్ని పూజించడం ఆపకూడదు. శివుని ఆలయాలకు వెళ్ళి.. తిరిగి వచ్చేటప్పుడు ఆలయ ద్వారాల వద్ద కూర్చుని వుండే పేదలకు చేతనైనా దానం చేయాలి. ఐశ్వర్యవంతులు కావాలనుకునే మేషరాశి జాతకులు వికలాంగులకు అవసరమయ్యే వస్తువులను దానం చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. 
 
వృషభం : వృషభ రాశి జాతకులు మంగళవారం పూట సాంబార్ అన్నాన్ని దానం చేయాలి. తద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది. ఇంకా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిల పెళ్ళికి సాయం చేస్తే.. కీర్తిప్రతిష్టలు చేకూరుతాయి. వృత్తిపరంగా అభివృద్ధి వుంటుంది. 
 
మిథునం: పితృదేవతలను తప్పకుండా పూజించాలి. బుధవారాల్లో పెరుమాళ్ స్వామివారి ఆలయానికి వెళ్లి.. దర్శనానంతరం మిరియాల పొంగలిని దానం చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంకా పేద విద్యార్థులకు సాయం చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. 
 
కర్కాటకం : కర్కాటకరాశిలో జన్మించిన జాతకులు పశువులకు ఆహారాన్ని దానం చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. ఇంకా పేద రోగులకు మందులు వంటివి తీసివ్వడం చేస్తే ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. 
 
సింహం : సింహరాశి జాతకులు పేదలకు పెరుగన్నం దానం చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వికలాంగులకు అవసరమయ్యే వస్తువులను దానంగా ఇవ్వడం ద్వారా పుణ్యం చేకూరుతుంది. 
 
కన్యారాశి : కన్యారాశి జాతకులు గురుభగవానుడిని తప్పకుండా పూజించాలి. ఆలయానికి వచ్చే భక్తులకు గోధుమలతో తయారు చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్, పెన్నులను దానంగా ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.  
 
తులాం : ఈ జాతకులు వినాయకుడిని పూజించాలి. పేదలకు మిరియాల పొంగలిని దానం చేయాలి. ఇలా చేస్తే ఆస్తులు చేకూరుతాయి. అనాధలైన విద్యార్థులకు చేతనైన సాయం చేయడం ద్వారా భావితరానికి ఎంతో  మేలు చేకూరుతుంది.  
 
వృశ్చికం : ఈ జాతకులు వికలాంగులకు దానం చేయాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే.. లక్ష్మీ నరసింహ స్వామికి పానకం సమర్పించాలి. పానకాన్ని ఆలయానికి వచ్చే భక్తులకు దానం ఇవ్వాలి. ఇంకా అమ్మవారి ఆలయాల్లో చక్కెర పొంగలిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేస్తే ఆదాయానికి ఢోకా వుండదు. 
 
ధనుస్సు : ఈ జాతకులు తప్పకుండా కుమారస్వామిని పూజించాల్సి వుంటుంది. గురుభగవానుడికి శెనగలతో కూడిన మాలను సమర్పించి.. వాటిని ప్రసాదం ఇవ్వాలి. వారంలో ఒక రోజు మంగళ వారం లేదా శుక్రవారం పూట దుర్గాదేవికి పుష్పాలను సమర్పించాలి. మంగళవారం పూట సాంబార్ అన్నం దానం చేయడం ద్వారా ప్రశాంత జీవితం చేకూరుతుంది. మహిళా వృద్ధులకు చేతనైన సాయం చేయాలి. 
 
మకరం : మకర జాతకులు పేద కన్యల వివాహానికి దానం చేయాలి. మూగజీవులకు ఆహారాన్ని అందించవచ్చు. ఆలయ మరమ్మత్తు పనుల కోసం చేతనైన సాయం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
కుంభం : కుంభ రాశి జాతకులు కులదైవాన్ని పూజించడం మరిచిపోకూడదు. పేద ప్రజలకు సాంబార్ అన్నం దానంగా ఇవ్వాలి. తద్వారా ధనం చేతికి అందుతుంది. పేద రోగులకు మందులు తీసివ్వడం చేస్తే.. సుఖమయ జీవితం చేకూరుతుంది. 
 
మీనం : మీన రాశి జాతకులు పౌర్ణమి రోజున శివుడిని దర్శనం చేసుకోవడం మంచిది. వికలాంగులకు దానం చేయడం ఉత్తమం. నువ్వుల నూనెలతో కూడిన దీపాలను దానంగా ఇవ్వొచ్చు. అయ్యప్ప భక్తులకు సాయం అందించడం ద్వారా మేలు చేకూరుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments