క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ కోట వద్ద నేతి దీపం.. నువ్వుల నూనె వాడితే?

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (22:39 IST)
Tulasi vivah
క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసీ పూజ విశిష్ట ఫలితాలను ఇస్తుంది. పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. వారికి వ్యాసమహర్షి రెండు వ్రతాల గురించి చెప్పారు. వాటిలో మొదటిది క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం. 
 
కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశీవ్రతం చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసికోట దగ్గర శుభ్రంచేసి ముగ్గు పెట్టి, అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను లేదా కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండువగా దీపాలు వెలిగించి.. తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యం, దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తికొలది తాంబూలం సమర్పించుకోవాలి. 
 
తులసికోట దగ్గర దీపదానం చేయాలి. భక్తితో  ఓ వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు, నాలుగొత్తులు వేస్తే రాజవుతారు. పది వత్తులు  విష్ణుసాయుజ్యం, వేయివత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవునేయి వేయాలి. నువ్వులనూనె కూడా వాడవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

తర్వాతి కథనం
Show comments