Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-09-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు..

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (11:09 IST)
మేషం: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు చిన్న అవకాశాన్నికూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
వృషభం: పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
మిధునం: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం: నూనె మిర్చి, కంది, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ఆలయాలను సందర్శిస్తారు.రావలసిన ధనం అందుతుంది. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. కంప్యూటర్, ఎలక్ర్టిక్, ఎలక్ర్టానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. 
 
సింహం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. ప్రయాణాల్లో చురుకుదనం కానవస్తుంది. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
కన్య: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎదుటి వారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. బంధువులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం.
 
తుల: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
వృశ్చికం: దంపతుల మధ్య అవగాహనలోపం చికాకులు వంటివి చోసుచేసుకుంటాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. చేతివృత్తుల వారికి అన్ని విధాల పురోభివృద్ధి. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
ధనస్సు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు.
 
మకరం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. ఇతరుల సహాయం అర్ధించటానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలేర్పడతాయి. క్రయ విక్రయ లాభసాటిగా ఉంటాయి.
 
కుంభం: మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్ధిస్తారు. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మీనం: ఉమ్మడి ఆర్ధిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments