Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు (04-07-17) ఇలా వున్నాయి...(వీడియో)

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. గృహంలో మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. చేతి వృత్తుల వారికి

Webdunia
సోమవారం, 3 జులై 2017 (22:20 IST)
మేషం:

ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. గృహంలో మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. 
 
వృషభం
భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. 
 
మిథునం 
ఆర్థిక స్థితిలో ఆశిస్తున్న మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగపరంగా మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాలికలు మంచి ఫలితాలనిస్తాయి. ఆస్థి పంపకాలు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం
రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి.
 
కన్య
ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. వృత్తివ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. 
 
తుల 
ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కొంటారు. పత్రిక, వార్తా సంస్థలోని వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ దర్శనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం 
కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తివ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. నిరంతర శ్రమతో మీరు ఆశించిన లక్ష్యాలను చేరుకోండి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
ధనస్సు 
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులు స్థానచలన యత్నాలు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఆపద సమయంలో బంధువుల అండగా నిలుస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మకరం 
విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తుసామాగ్రి అందజేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధిపొందాలని యత్నిస్తారు. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కుంభం
కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చుల వల్ల అధిక ధనవ్యయం తప్పదు. మధ్యమధ్య వైద్యుల సలహా తప్పదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. 
 
మీనం 
వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments