Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(21-07-2017)... ఎలా వుండబోతోందంటే...?

మేషం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలు, గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. తెలిసితెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాక

Webdunia
గురువారం, 20 జులై 2017 (22:40 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలు, గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. తెలిసితెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం : రాజకీయనాయకులు తాము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. 
 
మిథునం : కోర్టు వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ఆస్తి, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఉద్యోగ విరమణ చేసినవారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. నూతన పరిచయాలు వల్ల ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు వస్త్ర ప్రాప్తితో పాటు ఆభరణాలను సమకూర్చుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత వహించండి. 
 
సింహం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కన్య : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారు అభద్రతాభావం, ఆందోళనకు గురవుతారు. 
 
తుల : కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. నిరుద్యోగులు నిర్లప్త ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. వాహనం  కొనుగోలుకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. స్త్రీకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రవాణా రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. 
 
ధనస్సు : జూదాల్లో ధననష్టం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ప్రముఖుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.  
 
మకరం : ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి వెంచర్లు, నూతన పెట్టుడుల ఆలోచన వాయిదా వేయండి. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. 
 
కుంభం : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన దంపతుల మధ్య కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మీనం : అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలు ఉంటాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తినివ్వవు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో అధికంగా మాట్లాడటం మంచిది కాదు అని గమనించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

తర్వాతి కథనం
Show comments