Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(11-07-2017)... సెంటిమెంట్ల ప్రభావం అధికం...

మేషం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల్లో అధికార

Webdunia
సోమవారం, 10 జులై 2017 (23:10 IST)
మేషం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల్లో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం : విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. మీ ఊహలు, అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రియల్ ఎస్టేట్, చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఆటుపోట్లు అధికమవుతాయి. 
 
మిథునం: దైవ సేవా కార్యక్రమాల్లో ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయనాయకులు విదేశీ పర్యటనలలో మెళకువ అవసరం. వాహనయోగం వంటి శుభఫలితాలు పొందుతారు. 
 
కర్కాటకం: ప్రకృతి, సౌందర్యాలను చూసి సంతృప్తి చెందుతారు. క్రయ విక్రయదార్లకు చికాకులు ఏర్పడతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరి, సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. 
 
సింహం : ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు.
 
కన్య : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోను మెలకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. మీపై దుశ్శకునాలు, సెంటిమెంట్ల ప్రభావం అధికంగా ఉంటుంది.
 
తుల : రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రైవేట్ రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. 
 
వృశ్చికం : కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతిని దూరం చేస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి.
 
ధనుస్సు : ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశయం నెరవేరకపోవచ్చు. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచడం శ్రేయస్కరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
మకరం : దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. మీ సంతానం కోసం విలువైన వస్తువులను సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
కుంభం : పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. రవాణా రంగాల్లో వారికి లాభదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు ప్లీడరు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మీనం : విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రంగాల్లోని స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు. కాంట్రాక్టర్లకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారాలు వలన సమసిపోగలవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...

Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments