Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(7-7-2017)... వ్యాపారులకు లాభదాయకం...

మేషం: స్త్రీలకు, పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. దూర ప్రయాణాలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సోదరులకు మీ వంతు సహాయసహకారాలు అందిస్తారు.

Webdunia
గురువారం, 6 జులై 2017 (22:58 IST)
మేషం:
స్త్రీలకు, పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. దూర ప్రయాణాలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సోదరులకు మీ వంతు సహాయసహకారాలు అందిస్తారు. 
 
వృషభం
పెద్దల సహకారం లోపిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది తగిన సమయం కాదు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొను అవకాశం కలుగుతుంది. ఖర్చులకు తగిన విధంగా సంయమనం పాటించండి. గతంలో వాయిదాపడిన పనులు మరల ప్రయత్నించడం వల్ల ముందుకు సాగును. 
 
మిథునం
వాణిజ్య రంగాలలోని వారికి చురుకుదనం కానవస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం
ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సన్నిహితుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. కీలకమైన పత్రాల విషయంలో జాగ్రత్త పాటించాలి. 
 
సింహం
బంధువులు వచ్చు సూచనలు కలవు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు తప్పవు. 
 
కన్య
కొత్త రంగాలలోని ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో స్థిరత్వాన్ని పొందుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
తుల 
పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరీసోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. 
 
వృశ్చికం
వస్త్రం, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఆఫీసుల్లో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలు తీసుకుని ముందుకు సాగండి. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచిలాభం ఉంటుంది. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
ధనస్సు
ఆర్థిక చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సమయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహనానికి గురవుతారు. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 
 
మకరం
ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ, మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. 
 
కుంభం 
ఇనుము, సిమెంట్, కలప వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. దూరంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం ఆవేదన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. 
 
మీనం
ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభించగలదు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

ఎగిరే చేపలు.. తిమింగలం, గరుడ పక్షి నుంచి తప్పించుకుని.. (video)

"ఫ్యూచర్ సిటీ" కోసం.. 30వేల ఎకరాల భూమిని సేకరించాలి: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments