Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం... మీ రాశి ఫలితాలు 15-08-2017

మేషం : ఈ రోజు మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (05:47 IST)
మేషం : ఈ రోజు మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి  వస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
వృషభం : ఈ రోజు ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీలో వచ్చిన మార్పును మీ కుటుంబీకులు గుర్తిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణాలు, పన్నులు సకాలలం  చెల్లింపులు జరుపుతారు.
 
మిథునం: ఈ రోజు మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
కర్కాటకం : ఈ రోజు వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కివస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
సింహం: ఈ రోజు కుటుంబీకుల నుండి, మిత్రుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. నిర్మాణ పనులలో స్వయం వీక్షణ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల పని వారికి ఆశాజనకంగా ఉంటుంది.
 
కన్య : ఈ రోజు సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బంధుమిత్రుల కలయిక మానసికంగా కుదుటపడతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. రాజకీయనాయకులకు దూర  ప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
తుల : ఈ రోజు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు క్రీడ, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం : ఈ రోజు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఆహ్వానాలు ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి.
 
ధనస్సు : ఈ రోజు కుటుంబంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీ అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఫీజులు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.
 
మకరం : ఈ రోజు ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్టుగా వుంటాయి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం : ఈ రోజు మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. కొబ్బరి, పండ్లు, పువ్వులు, కూరగాయలు చిరు వ్యాపారుల కు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుండి సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం : ఈ రోజు భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. రావలసిన ధనం అందడంతో కుదువ పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments