Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం... మీ రాశి ఫలితాలు 06-08-2017

మేషం : ఈ రోజు కాంట్రాక్టర్లకు అధికమైన ఒత్తిడి తప్పదు. ఎదుటివారు మీకు సమవుజ్జీవులేనని గ్రహించండి. మీ కళత్ర మొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. బంధుమిత్రులతో కలసి విందు, వినోదాల్ల

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (05:52 IST)
మేషం : ఈ రోజు కాంట్రాక్టర్లకు అధికమైన ఒత్తిడి తప్పదు. ఎదుటివారు మీకు సమవుజ్జీవులేనని గ్రహించండి. మీ కళత్ర మొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. బంధుమిత్రులతో కలసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమయానికి సహకరించని వ్యక్తుల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం : ఈ రోజు కుటుంబీకులతో కలసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. ఖర్చులు అధికమైనా ధనానికి లోటుండదు. రాజకీయ నాయకులు సాంఘిక కార్యక్రమాల్లోనూ, వేడుకల్లోనూ పాల్గొంటారు.
 
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యం, దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు.
 
కర్కాటకం: వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆనందాశ్చర్యాలు కలిగిస్తాయి.
 
సింహం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభాసమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
 
కన్య : ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. చేపట్టిన  పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. క్రీడా రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
తుల : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. వృత్తుల  వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు.
 
వృశ్చికం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనవలసివస్తుంది.
 
ధనస్సు : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు పంచుకుంటారు. పిల్లల భవిష్యత్తును గురించి పథకాలు వేసి జయం పొందుతారు. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం.
 
మకరం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. విద్యార్థులు నూతన వాతావరణం, పరిచయాలకు క్రమంగా అలవాటు పడతారు. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి.
 
కుంభం : బంధు మిత్రుల రాకతో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వాక్చాతుర్యంతో అందరినీ సంతృప్తిపరుస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం : నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రుణ వ్యవహారాల్లో వచ్చే ఒత్తిడిని తెలివిగా సరిచేయగలుగుతారు. వ్యాపారరీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాల్లో పాల్గొంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

తర్వాతి కథనం
Show comments