Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-10-2018 మంగళవారం దినఫలాలు - శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యాలు..

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (08:42 IST)
మేషం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో గట్టి పోటీ, ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పట్టుదలతో శ్రమించి పనులు పూర్తిచేస్తారు. ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. 
 
వృషభం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చేతిలో ధనం నిలబడటం కష్టమే. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అనుకుని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది.  
 
మిధునం: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
కర్కాటకం: శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యాలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.  
 
సింహం: ఉపాధ్యాయులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. శారీరక శ్రణ, అకాల భోజన వలన ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రింటింగ్ రంగాలవారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు.  
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తరచు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మెుండి బాకీలు వసూలుకాగలవు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. 
 
తుల: బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.   
 
వృశ్చికం: స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వలన విభేదాలు తలెత్తవచ్చు.  
 
ధనస్సు: ప్రైవేటు సంస్థల్లో వారు, ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం మెుండిపైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. రాజకీయనాయకులకు ఒప్పందాలు, హామీల విషయంలో పునరాలోచన మంచిది.  
 
మకరం: రాజకీయనాయకలకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనును పునఃప్రారంభమవుతాయి. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. 
 
కుంభం: రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. 
 
మీనం: భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడుతాయి. మీ యత్నాల్లో ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణ నిలదొక్కుకుంటారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments