Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-03-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యుడిని పూజిస్తే..?

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (05:00 IST)
ఆదిత్యుడిని మంకెన పూలతో ఆరాధించిన సర్వదా శుభం, జయం చేకూరుతుంది.  
 
మేషం: పత్రికా రంగంలోని వారికి ఏమరుపాటుతనం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కళాకరులకు నూతనోత్సాహం కానవస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. విదేశీ పర్యటనలు వాయిదాపడతాయి. 
 
మిథునం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దక్కించుకుంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. విద్యార్థినిలు ధ్యేయ సాధనకు మరింతగా శ్రమించాలి. సోదరీ, సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. 
 
సింహం: దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు, పట్టుదలతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
కన్య: ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల వారికి అనుకూలం. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికి చేసే ప్రయత్నం వాయిదా వేయండి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
తుల: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ కనసబరుస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత విడనాడినట్లైతే సత్ఫలితాలు సాధిస్తారు. 
 
వృశ్చికం: సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. కీలకమైన కొనుగోళ్ళు లాభిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. స్త్రీలు అకారణంగా నవ్వడం వల్ల కలిగే అనర్ధాలను గ్రహిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరించే ప్రమాదం వుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. నోరు అదుపులో వుంచుకోవడం మంచిది. 
 
కుంభం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి చూడాల్సి వుంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనం: కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments