20-06-2019 గురువారం మీ రాశి ఫలితాలు..

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (11:05 IST)
మేషం: పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవాల్సి వుంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
వృషభం: రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం వుంటుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం: ప్రింటింగ్ రంగాల వారికి అరకకొర పనులే లభిస్తాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక సెలవు, లోన్లు మంజూరు కాగలవు. 
 
కర్కాటకం: బ్యాకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో మెలగవలసి వుంటుంది గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు ఆడంబరాలకు పోకుండా వుండటం మంచిది. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. 
 
సింహం: విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతని పెంచుతాయి. 
 
కన్య: నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు సామాన్యం. విద్యార్థినులకు కొత్త పరిచయాలు  సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. కొత్త ప్రదేశ సందర్శనల వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. 
 
తుల: కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు వంటివి తప్పవు. వస్త్ర లాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందు భోజనం, కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 
 
వృశ్చికం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మిమ్ములను పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
ధనస్సు: ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ హోదా చాటుకోవటానికి ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం: వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు.
 
కుంభం: ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి వుంటుంది. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. క్రయ విక్రయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. చిరు వ్యాపారులకు వృత్తుల వారికి ఆశాజనకం. పుణ్యక్షేత్ర సందర్శనలు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మీనం: మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించినట్లైతే సత్ఫలితాలు పొందగలరు. సోదరుల మధ్య సఖ్యత అంతగా వుండదు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments