Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-12-2018 ఆదివారం దినఫలాలు - మీ శ్రీమతి మెుండివైఖరి మీకు ఎంతో..

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (08:32 IST)
మేషం: ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారి గురించి అధికంగా ఆలోచించడం వలన సమస్యలను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలు సాఫీగా సాగుతాయి. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు.
 
వృషభం: బంధుమిత్రులకోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మీ శ్రీమతి మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉన్నత స్థాయి అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మీ సంతానం విషయాలకు అడ్డుచెప్పడం మంచిది కాదు. ఉద్యోగులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.   
 
మిధునం: కలంకారీ, చేనేత, పీచు వ్యాపారస్తులకు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులు, వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు ధ్యేయసాధనకు మరింత శ్రమించాలి. ప్రతీ పనిలోనూ, ఆచితూచి వ్యవహరించండి.  
 
కర్కాటకం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, పనివారలతో సమస్యలు వంటివి తలెత్తుతాయి.   
 
సింహం: భాగస్వామికంగా సొంత వ్యాపారాలకే ప్రాధాన్యం ఇవ్వండి. మొహ్మమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. విద్యార్థులు ధ్యేయసాధనకు మరింత శ్రమించాలి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసివస్తుంది.  
 
కన్య: ఉద్యోగస్తులకు మీ కార్యక్రమాలు, పనులు అధికంగా ఉంటాయి. కుటుంబీకులు అన్ని విధాలా మీకు సహాయసహకారాలు అందిస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు ఆదాయాభివృద్ధి. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్ధాలు తలెత్తుతాయి.   
 
తుల: మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.  
 
వృశ్చికం: మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో రాణింపు, వ్యవహార జయం పొందుతారు. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరీసోదరుల నుండి అభ్యంతరాలెదుర్కుంటారు.  
 
మకరం: వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. ఆత్మీయులు ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మెుదలెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. ప్రధాన కంపెనీల షేర్లు విలువలు తగ్గే సూచనలున్నాయి. 
 
కుంభం: విందు వినోదాల్లో పాల్గొంటారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మంచిది గుర్తింపు లభిస్తుంది. గృహ సామగ్రి, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొన్ని పనులు అతికష్టంమ్మీద పూర్తికాగలవు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.    
 
మీనం: ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గృహ మార్పు వలన ఆశించిన ప్రయోజనం ఉంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. ఖర్చులు అధికమవుతాయి. బంధుమిత్రులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments