Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-04-2020 బుధవారం దినఫలాలు - హయగ్రీవ కవచం పఠిస్తే...

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : బంధుమిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. పాత బాకీలు చెల్లిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : ప్రభుత్వ కార్యాలయాలలో పనులు వాయిదాపడతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ, ఏకాగ్రత అవసరం. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాల విషయంలో ఖచ్చితంగా మెలగాలి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కర్కాటకం : నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడును. దంపతుల మధ్య అపార్ధాలు తలెత్తుతాయి. ప్రైవేటు సంస్థల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం మంచిదికాదు. స్త్రీలు ఉదరం. నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
సింహం : కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధత పరిస్థితులు తీరిపోతాయి. ముఖ్యమైన విషయాలను మీ శ్రీమతికి తెలియజేయండి ఉత్తమం. ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికం. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. సోదరుల నుంచి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. 
 
తుల : మిత్రుల ప్రయోజనాలు కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. పాత బిల్లులు చెల్లిస్తారు. స్త్రీల వాక్చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. లాయర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా గెలుపొందుతారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. సొంతంగా వ్యాపారం సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికానవస్తుంది. 
 
ధనస్సు : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవడం ఉత్తమం. స్త్రీలకు అయినవారిని చూడాలనే కోరిక స్ఫురిస్తుంది. ఇతరులను ధన సహాయం అడగటానికి అభిజాత్యం సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. 
 
మకరం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యుత్ రంగాల వారికి అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. 
 
కుంభం : స్త్రీలకు అయినవారిని చూడాలనే కోరిక స్ఫురిస్తుంది. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. ఒక అనుభవం మీకెంతో జ్ఞాపకాన్ని ఇస్తుంది. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. నెలసరి వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. 
 
మీనం : మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments