Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-12-2019 మీ రాశిఫలాలు - నూతన రుణాల కోసం... (video)

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (09:25 IST)
మేషం : సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువుల రాకవల్ల పనులు వాయిదాపడుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృషభం : ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. 
 
మిథునం : వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. 
 
కర్కాటకం : చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. 
 
సింహం : ప్రతి విషయంలోనూ ఓర్పుతో వ్యవహరించాలి. రుణాలు తీరుస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రాజకీయ నాయకులు అధికారులతో సమావేశాలు, పర్యటనల్లో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
తుల : ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దైవ, సేవాకార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
వృశ్చికం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. 
 
మకరం : శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసివుంటుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. 
 
మీనం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు, అకౌంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments