Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-08-2019 గురువారం దినఫలాలు - సంఘంలో కీర్తి, గౌరవం...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (09:44 IST)
మేషం: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో అసహనానికి గురవుతారు. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. సన్నిహితులు, కుటుంబీకుల సహకారంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.
 
వృషభం: సంఘంలో కీర్తి, గౌరవం లభిస్తాయి. మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. స్త్రీలకు విలాసాలు, అలంకరణల పట్ల వ్యామోహం పెరుగుతుంది. ప్రేమికుల తొందరపాటుచర్యలు వివాదస్పదమవుతాయి. క్రయ విక్రయాలు భారీగా సాగుతాయి.
 
మిధునం: దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
 
కర్కాటకం: ఫ్యాన్సీ, బేకరి, తినుబండారాల  వ్యాపారులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్ధిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. చేపట్టిన పనుల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.
 
సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రియతముల గురించి అప్రియమైన వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. మీ సంతానం గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు.
 
కన్య: కళా, సాంస్కృతిక ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. కార్యసాధనలో మొండిధైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సజావుగా సాగుతాయి.
 
తుల: మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. బంధుమిత్రులలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళుకువ అవసరం. భాగస్వామిక, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విద్యార్ధులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృశ్చికం: భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరిక్షలలో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు పొందగలరు. ఆస్తి వ్యవహారాల విషయమై సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
ధనస్సు: ఆర్ధికస్థితి కొంత మెరుగుపడినా కుదుటపడటానికి మరి కొంతకాలం పడుతుంది. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తుల ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. నూతన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులు సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
మకరం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకం. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ప్రేమికులకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
 
కుంభం: పారిశ్రామిక రంగాల వారికి అవసరమైన లైసెన్సులు మంజూరవుతాయి. క్రయ విక్రయాలు వేగం పుంజుకుంటాయి. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి.
 
మీనం: కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దూరప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఇసుక రవాణాదారులకు ఆటంకాలను ఎదుర్కొంటారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వ్యాపారులకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments