Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మీ రాశి ఫలితాలు.. సూటీపోటీ మాటల వల్ల..?

మేషం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. కుటుంబీకులతో పుణ్యక

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (06:27 IST)
మేషం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. కుటుంబీకులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం చేకూరుతుంది.
 
వృషభం: వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
మిథునం: సామూహిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు.
 
కర్కాటకం: మీ ఆదాయానికి మించి ఖర్చు చేయటం వలన ఆందోళన పడక తప్పదు.  కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. కొంతమంది సూటీపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.
 
సింహం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం వుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు.
 
కన్య: ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. రాజకీయాల్లో వారికి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
 
తుల: ముఖ్యులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం: స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరి, సోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వుంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
ధనస్సు: ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు.
 
మకరం: ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి.
 
కుంభం: ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యాలందు విఘ్నాలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.
 
మీనం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. ఎవరికీ హామీలు ఉండటం మంచిది కాదని గమనించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

తర్వాతి కథనం
Show comments