Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేషరాశి జాతకులకు ఆగస్టు ఎలాంటి ఫలితాలనిస్తుంది?

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:58 IST)
మేషరాశి జాతకులు ఎన్ని కష్టాలొచ్చినా ఏమాత్రం పట్టించుకోరు. ఏది జరిగినా మంచిదేనని, దైవంపై భారమేసి జీవితాన్ని గడిపేస్తారు. ఈ జాతకులకు ఈ ఆగస్టు నెల ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే.. ఈ నెలలో కుజ మహర్దశ కారణంగా మాస ప్రారంభంలో శుభ ఫలితాలుంటాయి. ఎలాంటి పనినైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు. బుద్ధి చాతుర్యం ప్రదర్శిస్తారు. పలుకుబడి అధికమవుతుంది. కీలక వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. 
 
మేషరాశి నాలుగో స్థానంలో సూర్యుడు, బుధ, గురు గ్రహాల కలయిక కారణంగా ధనం రాబడి ఉంటుంది. వ్యాపారం, వృత్తిలో మార్పు అనుకూలిస్తుంది. పదో స్థానం, గురుభగవానుడి దృష్టి కారణంగా ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ లభిస్తుంది. వ్యాపారంలో బకాయిలు వసూళ్లవుతాయి. వాహనాల ద్వారా లాభం చేకూరుతుంది. 
 
అయితే సరుకులు విదేశాలకు పంపిస్తే ప్రత్యేక దృష్టి అవసరం. కుటుంబీకుల కోసం ధనం వెచ్చిస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలకు బ్రేక్ పడుతుంది. మిమ్మల్ని ఎవరైనా నిందించినా పట్టించుకోకుండా ఉండిపోవడం మంచిది. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మహిళలు : మేషరాశిలో జన్మించిన మహిళలకు ఈ మాసం అన్ని విధాలా అనుకూలిస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ధనం రాబడి ఉంటుంది. వాక్చాతుర్యతతో వ్యాపారంలో రాణిస్తారు. 
 
విద్యార్థులు : మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఆగస్టు నెల ఆశించిన ఫలితాలను ఇస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. క్రీడాపోటీల్లో రాణిస్తారు. తోటి విద్యార్థుల సహకారం అందుతుంది.
 
ఇక 5, 6 తేదీల్లో కీలక ఫైళ్లపై సంతకాలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
లక్కీ డేట్స్ : 19, 20.
లక్కీ డేస్ : గురు శుక్ర వారాలు
ఉచ్ఛరించాల్సిన మంత్రం : "ఓం శ్రీ షణ్ముగాయ నమః" అనే మంత్రాన్ని రోజు ఏడు సార్లు పఠించాలి. 
పరిహారం : మంగళవారాల్లో కుమార స్వామికి నేతితో దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments