Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యంగన స్నానమంటే ఏంటి.. ఏ వారం ఎలాంటి ఫలితం?

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (19:31 IST)
పూర్వకాలంలో ఒళ్లంతా నూనెలు రాసుకుని, మర్ధన చేసుకుని, నూనె ఇంకేంత వరకు ఆరబెట్టుకుని పెద్దకాగుతో కాచిన వేడినీళ్లతో చక్కగా స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఈ తరహా స్నానాలు చేసేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలో అవి దూరమయ్యాయి. ఎప్పుడో శుభకార్యాల సమయాల్లో మాత్రమే వీటిని పాటిస్తున్నారు. 
 
వారానికి ఓ సారి తప్పకుండా అభ్యంగన స్నానాలు చేయడం మంచిదని వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. వెచ్చని నూనెతో మర్ధన చేసుకుని తలంటుకునే ఈ అభ్యంగన స్నానాలను కొంత మంది మాత్రం పాటిస్తూనే ఉన్నారు. 
 
అయితే ఈ అభ్యంగన స్నానాలు చేసేటప్పుడు కొన్నినియమాలు పాటించాల్సి ఉంటుంది. వారాలను చూసుకుని, తెలుసుకుని చేయడం ద్వారా శుభాలు జరుగుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
 
సోమవారం ఈ స్నానాలు చేయడం ద్వారా ఇంట్లో కొత్త వస్తువులు చేరతాయి. మంగళవారం మాత్రం ఇలాంటివి మంచివి కావు. మంగళవారం స్నానాలు చేయడం ద్వారా ఇంటికి అరిష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. 
 
అలాగే బుధవారం నాడు ఈ అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది. గురువారం అభ్యంగన స్నానాలతో మేధస్సు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
 
శుక్రవారం ఈ అభ్యంగన స్నానాలు చేయడంతో పేరుప్రతిష్టలు కలుగుతాయి. శనివారం ఈ స్నానాలు చేయడం ద్వారా సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఆదివారం ఈ స్నానాలు చేయడంతో సౌందర్యం నశిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments