Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం మీ రాశి ఫలితాలు-అతిగా వ్యవహరించడంతో భంగపాటు తప్పదు

మేషం: స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీరు అభిమానించే వ్యక్తి గురించి ప్రశంసలు

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (06:04 IST)
మేషం: స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీరు అభిమానించే వ్యక్తి గురించి ప్రశంసలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం, ఆందోళన తప్పదు.
 
వృషభం: బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు స్థిరబుద్ధి అవసరమని గమనించండి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, అవాంతరాలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం: ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తించుకోవాలి. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. విందులు, వినోదాల్లో అతిగా వ్యవహరించడం భంగపాటుకు గురికాక తప్పదు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
సింహం: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొంతమంది మీ నుంచి ధనసహాయం కోరవచ్చు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు ఇంటా, బయటా ఆమోదం లభిస్తుంది. 
 
కన్య : అవివాహితుల్లో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చర్చలు జరుపుతారు. ఇతరులతో  కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల: రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. రుణవిముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృశ్చికం: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. స్త్రీలు తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
ధనస్సు: వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం, గౌరవం లభిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. మీ సంతానం పై చదువులు, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
మకరం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కళాకారులకు పత్రికారంగంలో వారికి వారి ప్రతిభా, పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు.
 
కుంభం: ఆత్మీయుల నడుమ విలువైన కానుకలిచ్చి పుచ్చుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వాణిజ్య ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆస్తి పంపకాల సమస్యకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది.
 
మీనం: మీ మేదస్సుకి, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

02-01-2025 గురువారం దినఫలితాలు : బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు...

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

01-01-2025 నుంచి 31-01-2025 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments