Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృషభ రాశి 2019 గోచారము పరీక్షించగా...(Video)

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (18:46 IST)
వృషభరాశి: ఈ రాశివారికి ఈ సంవత్సరం నవంబర్ 4వ తేదీ వరకు సప్తమంలో బృహస్పతి ఆ తదుపరి అంతా అష్టమమునందు, ఈ సంవత్సరం ద్వితీయ స్థానము నందు రాహువు, అష్టమ స్థానము నందు కేతువు, 2020 ఫిబ్రవరి వరకు అష్టమము నందు శని, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తాడు.
 
ఈ గోచారం పరీక్షించగా 'మౌనేన కలహం నాస్తిః' అన్నట్లుగా ఈ సంవత్సరం మౌనం వహించి, అన్ని పనులు చేసుకుపోవడం వలన పేరుప్రతిష్టలు, సంపదలు చేకూరుతాయన్న వాస్తవాన్ని గ్రహించండి. ఆర్థిక విషయాలయందు జాగ్రత్త అవసరం. ఆశించిన ఆదాయం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు వేగంగా వస్తుంటాయి. ఋణములు నూతనంగా కావలసిన సమయానికి అందవు. ఇతరుల సహాయం కోసం ఎదురుచూడకండి. లక్ష్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఆర్థిక వ్యవహారాల విషయమై మనోవేదన చెందుతారు. 
 
శని, గురువులు బాగుండని దృష్ట్యా అన్ని విషయాలలోను విభేదములకు అవకాశం ఉన్నది. కుటుంబీకుల సహాయ, సహకారాలు మీకు అందుతాయి. ఆపద సమయంలో మీ వెన్నంటే ఉంటారు. ఇతరుల ముందు మీ కుటుంబ విషయాలు ఏకరువు పెట్టడం మంచిదికాదని గ్రహించండి. ఉద్యోగ వ్యవహారాల్లో అధికారులతో, తోటివారితో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమాధిక్యత. అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అధిక శ్రమానంతరం సత్ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఏ మాత్రం ముందుకు సాగవు. 
 
బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. కళ్లు, నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు యత్నాలు ఏమాత్రం కలిసిరావు. కోర్టు వ్యవహారాలు కొంత చికాకు పెట్టినప్పటికి అనుకూల ఫలితాలు రాగలవు. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలు మీ వద్ద నుండి కొంతసొమ్ము పొందదానికి యత్నిస్తారు జాగ్రత్త వహించండి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లోవారికి తగిన గుర్తింపు, రాణింపు పొందుతారు. 
 
వాతావరణం అనుకూలించక, సరైన గిట్టుబాటుధన అందక రైతులు ఆవేదనకు లోనవుతారు. స్పెక్యులేషన్ రంగాల్లోవారికి లాభదాయకం. అవివాహితులు కోరుకున్న సంబంధాలు స్థిరపడగలవు. వారిలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. విలువైన వస్తు వాహనాలు అమర్చుకుంటారు. ముఖ్యుల మాటా, తీరు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. వైద్య, కళా రంగాల్లో వారికి అనుకున్నంత పురోగతి కానరాదు. దూరప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో మెళకువ అవసరం. నూతన వివాహితులు శుభవార్తలు వింటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. నూతన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు ఉన్నప్పటికి అవి క్రియారూపం దాల్చవు.
 
* 2020 ఫిబ్రవరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, నీలపు శంకు పూలతో శనిని పూజించిన సర్వదోషాలు తొలగిపోతాయి.
* ఈ రాశివారు లక్ష్మీనారాయణస్వామిని తెల్లని పూలతో పూజించిన మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
* కృత్తికా నక్షత్రం వారు అత్తి చెట్టును, రోహిణి నక్షత్రం వారు నేరేడు, మృగశిర నక్షత్రం వారు మారేడు దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటిన మీకు అభివృద్ధి కానవస్తుంది.
* కృత్తికా నక్షత్రం వారు స్టార్‌రూబి, రోహిణి నక్షత్రం స్పందనముత్యం, మృగశిర నక్షత్రం వారు పగడం ధరించిన శుభం కలుగగలదు. 
 
వీడియోలో చూడండి ఈ రాశి ఫలితాలు... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

తర్వాతి కథనం
Show comments