Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015 వృషభ రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి...

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (20:49 IST)
కృత్తిక 2, 3, 4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహణి 1, 2, 3, 4 పాదములు (ఓ, వా, వీ, వూ)
మృగశిర 1, 2 పాదములు  (వే,వో)
ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 9, అవమానం 6
వృషభ రాశివారికి జూలై 14వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా, చతుర్థము నందు, ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా సప్తమము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా.. "భ్రమన్ సంపూజ్యతే రాజ" అన్నట్లుగా అధిక, శ్రమ, త్రిప్పట ఉన్నప్పటికీ దీక్ష, ఏకాగ్రత, నిరంతర కృషితో అనుకున్నది సాధించండి. కాలం మీకు అనుకూలంగా ఉన్నది. మీ కృషికి అదృష్టం మీ తలుపు తడుతుంది. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఎదుటివారి ఆలోచనలు గ్రహించి ఎత్తుకు పైఎత్తు వేయడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. రిప్రజెంటేటివ్‌లకు, ఫ్యాన్సీ రంగాలలో వారికి, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. రుణాలు తేలికగా తీర్చగలుగుతారు. 
 
విద్యార్థులకు మతిమరుపు పెరగటం వల్ల ఆందోళనకు గురవుతారు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థిస్తారు. సభలు, సమావేశాలలో మీ వాగ్ధాటికి మంచి గుర్తింపు లభిస్తుంది. వాహన చోదకులకు జాగ్రత్త అవసరం. స్థిరాస్తులను అమ్మానికై చేయు యత్నాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ చిన్నారుల గురించి మంచి మంచి పథకాలు వేస్తారు. స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. 
 
వస్త్ర బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. టెక్నికల్, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, పారిశ్రామిక రంగాల్లో వారు పురోభివృద్ధి పొందుతారు. విదేశాలు వెళ్లాలనే మీ ఆలోచన క్రియా రూపం దాల్చుతుంది. గృహ, నిరుద్యోగులు ఎటువంటి మధ్యవర్తిత్వం వహించడం వల్ల అపవాదులు, సమస్యలు తప్పవు. వైజ్ఞానిక, శాస్త్ర, అంతరిక్ష, గణిత, సైన్సు రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. 
 
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు హడావుడి నిర్ణయాల వల్ల ఆటంకాలు, సమస్యలు ఎదుర్కొనక తప్పదు. షేర్ వ్యాపారస్తులకు, స్పెక్యులేషన్ చేయువారికి మొదటి భాగంలో శుభదాయకం. సినిమా, పారిశ్రామిక రంగాల్లో ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి, మీడియా రంగాల్లో వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. చేతిపని వారికి, తాపీ పనివారికి, స్నేహితుల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆడిటర్లకు, ఫ్లీడర్లకు, ఫ్లీడర్ గుమస్తాల శ్రమకు తగిన సత్ఫలితాలు ఉండగలవు. కిళ్లీ, కిరాణా రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ రాశివారు కనకాధార స్తోత్రం చదవడం వల్ల లేక వినడం వల్ల ఆర్థికాభివృద్ధి పొందుతారు. 
 
** కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టును, రోహణి నక్షత్రం వారు నేరేడే, మృగశిర నక్షత్రం వారు మారేడు దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. కృత్తిక నక్షత్రం వారు పుచ్చుకెంపు లేక స్టార్ రూబి, రోహిణి నక్షత్రం వారు స్పందన ముత్యం లేక జాతి ముత్యం, మృగశిర నక్షత్రం వారు జాతి పగడం ధరించిన శుభం కలుగుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments