Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015లో కుంభ రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (22:30 IST)
ధనిష్ఠ 3, 4 పాదములు (గూ, గే)
శతబిషం 1, 2, 3, 4 పాదములు (గో, సా, సీ, సూ)
పూర్వాభదర 1, 2, 3 పాదములు (సే, సో, దా)
ఆదాయం 5, వ్యయం 2, పూజ్యత 5, అవమానం 4

 
కుంభ రాశివారికి ఈ సంవత్సరం అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు జూలై 14 వరకు షష్ఠమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా సప్తమము నందు ఈ సంవత్సరం అంతా రాజ్యము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా...'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' అన్నట్లుగా శ్రద్ధ వహించడం వల్ల మంచి జ్ఞానంతో పాటు అనుకున్నది సాధించగలుగుతారు. తొందరపాటుతనం మంచిదికాదని గమనించండి. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ కుటుంబీకుల కోసం మంచిమంచి పథకాలు వేస్తారు. కొత్త కొత్త స్నేహాలు కోరుకుంటారు. వ్యవసాయ రంగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఒక స్థిరాస్తిని అమ్మ మరల కొనుగోలు చేస్తారు. జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఏజెన్సీ రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది. 
 
పారిశ్రామిక రంగంలో వారికి పురోభివృద్ధి కానరాగలదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్థిర నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. రాజకీయాల్లో రాజకీయాల్లో వారికి రహస్య విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. వస్త్ర రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కిరాణా వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరం. 
 
చేబదులు తీసుకోవడం వల్ల, వడ్డీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులలో ద్వితీయ భాగంలో పురోభివృద్ధి కానవస్తుంది. వైద్య రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. శాస్త్రజ్ఞులకు, కళాకారులకు, రచయితలకు, పండితులకు పురస్కారాలు లభించగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం, కొత్త కొత్త వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
గృహోపకరణాలు అమర్చుకుంటారు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు, అనుకోని గుర్తింపు లభిస్తుంది. క్రీడా రంగాల్లో వారికి, సంగీత అభిమానులకు, సైన్సు రంగాల్లో వారికి సత్ కాలం అనే చెప్పవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్, రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడతారు. దానధర్మాలు పట్ల ఏకాగ్రత వహిస్తారు. ధాన్యం వ్యాపారస్తులకు, మిల్లర్లకు సంతృప్తి కానరాగలదు. 
 
ఈ రాశావారికి అష్టమ రాహుదోషం ఏర్పడినందువల్ల ఈ క్రింది మంత్రాన్ని ప్రతీ రోజు 18 సార్లు పఠించినా సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. 
 
"ఓం శీర్షరూపాయ విద్మహే సింహికేశాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్"
 
** ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి, శతభిషా నక్షత్రం వారు అరటి, పూర్వాభద్ర నక్షత్రం ి చెట్టును దేవాలయాల్లోగానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లోగానీ నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడినా మీకు అభివృద్ధి కానవస్తుంది. 
 
ఈ రాశివారు ప్రతి రోజూ కనకధారా స్తోత్రాన్ని చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి పురోభివృద్ధి కానవస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జాతి తెల్ల పగడం, శతబిషా నక్షత్రం వారు ఎర్ర గోమేధికం, పూర్వాభద్ర వారు వైక్రాంతవణి లేక కనకపుష్యరాగం అనే రాయిని ధరించినా శుభం కలుగుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments