Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

Webdunia
బుధవారం, 18 జులై 2012 (17:44 IST)
FILE
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు.

ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు.

గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్‌ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ

Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

Kavitha New Party: సొంత పార్టీని ప్రారంభించనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

Show comments