Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నక్షత్రంలో పుట్టారా..? ఐతే మొండితనం ఎక్కువే!

Webdunia
WD
గురు గ్రహ నక్షత్రమైన విశాఖలో పుట్టిన జాతకులకు పట్టుదల, మొండితనం ఎక్కువని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇతరులకు చిన్న సహాయం చేసినా.. భూతద్దంలో చూపించే మనస్తత్వం వీరిదని వారు చెబుతున్నారు. ఇతరులకు సహాయం చేయాలంటే వెనుకడుగు వేసే ఈ జాతకులు, సతీమణి లేదా స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించడం కష్టమేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

కఠినమైన మనస్తత్వం కలిగి వుండే ఈ జాతకులు, సంతానం వల్ల పేరు, ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మినహా ఇతరులపై ప్రేమాభిమానులు చూపడం తక్కువేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు తనకు తోచిన మార్గంలో పయనిస్తూ... ఇతరుల సలహాలను ఏమాత్రం గౌరవించరు. అన్యభాషల పరిజ్ఞానంతో ఏ రంగంలోనైనా ధీటుగా రాణిస్తారు. పొదుపుకు పెద్దపీట వేసే ఈ జాతకులకు ఆధ్మాతిక చింతన మెండు. అయితే ఆధ్యాత్మిక రంగంలో మోసపోయేందుకు ఆస్కారాలున్నాయి.

అలాగే కీర్తి, స్థిరాస్తులు వంశ పారంపర్యంగా లభిస్తాయి. వంశపారంపర్య ఆస్తికంటే స్వతహాగా ఆస్తిని కూడబెట్టుకునే సత్తా విశాఖ నక్షత్ర జాతకులకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలిస్తుంది. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు ఆరు అనే సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసిరావు. ఇదేవిధంగా గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమం దినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా విశాఖ నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.

ఇదిలా ఉంటే.. విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా తొమ్మిది వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుని దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Show comments