Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది రేవతి నక్షత్రమా..? అయితే ఆడంబరం తక్కువే..!

Webdunia
WD
దేవగణ నక్షత్రమైన రేవతిలో జన్మించిన జాతకులు నిరాడంబరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గణితంలో ప్రజ్ఞావంతులు, మేధావులు అయిన ఈ జాతకులు దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి, సాహిత్య రంగంలో అభిరుచిగల ఈ జాతకులకు పాడిపంటలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే కలిసివస్తుంది.

కష్టపడేతత్త్వం, తొందరగా కోపం రాని తత్వము, ప్రశాంతంగా, నిబ్బరంగా సమాధానం చెప్పడం వీరి గుణం. ఎన్ని సమస్యలున్నా వాటినన్నింటిని పక్కనబెట్టి చక్కగా నిద్రపోవడం చేస్తారు. అయితే అన్ని రంగాల్లో ధీటుగా రాణించడం ఆర్థికంగా మంచి స్థితికి ఎదగడం చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇతరుల ఆస్తికి ఆశపడని రేవతి నక్షత్ర జాతకులు.. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుంచి తప్పించుకుంటారు. వినూత్నమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులను అలంకరిస్తారు. కుటుంబాన్ని, నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. సంతానం పట్ల ప్రేమగా గౌరవంగా ఉంటారు. మంచితనంతోనే జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. దూర ప్రాంతాలను సందర్శించడం, వేద వేదాంగాల సారాన్ని తెలుసుకోవాలని తపన వీరికి ఉంటుంది.

పెద్దల పట్ల గౌరవంతో ప్రవర్తించే ఈ జాతకులకు భాగస్వామి అన్నివిధాలా సహకరిస్తుంది. వ్యాపారంలో రాణించి ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకోవడానికి నిత్యం శ్రమించే ఈ జాతకులకు గురువారం కలిసివస్తుంది. ఈ జాతకులు గురువారం ప్రారంభించే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా ఆది, సోమవారాలు కూడా వీరికి శుభ ఫలితాలిస్తాయి. అయితే మంగళవారం మాత్రం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మంగళవారం ఈ జాతకులు ఏ మాత్రం అనుకూలించదు.

ఇకపోతే.. రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 3, 12, 21, 30, 48, 57, 66, 75 మరియు 7, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు శుభఫలితాలనిస్తాయి. అలాగే 1, 2, 9 అనే సంఖ్యలు కూడా కలిసివస్తాయి. కానీ 5,6 సంఖ్యలు ఈ జాతకులకు అనుకూలించవు.

అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఎరుపు, పసుపు రంగులు అన్ని విధాలా కలిసివస్తాయి. ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా శాంతి లభిస్తుంది. ఇందులో పసుపు రంగు చేతిరుమాలును వాడటం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. వీరు ధరించే దుస్తుల్లో కొంతైనా పసుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

Show comments