Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది పుబ్బ నక్షత్రమా? ఐతే స్నేహం కోసం ప్రాణమిస్తారు.!

Webdunia
WD
శుక్రగ్రహ నక్షత్రమైన పుబ్బ నక్షత్రంలో పుట్టిన జాతకులు అదృష్టానికి దగ్గరగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవసరమైతే అర్హత లేని వారిని కూడా తన మనిషిగా భావించి అందలం ఎక్కిస్తారు.

స్నేహితుల వలయం ఎక్కువగా ఉండే ఈ జాతకులు.. స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు స్నేహితుల ఉచ్చునుండి జీవితాంతం వీరు బయటపడలేరు.

సమాజసేవలో మంచి చురుకైన పాత్ర పోషించే ఈ జాతకులు.. ఇతరుల అభిప్రాయాలను ఏ మాత్రం ఖాతరు చేయరు. చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తన వర్గాన్ని మాత్రం బలోపేతం చేసుకుంటారు.

ఇతరులకు సాయం చేయాలనే తపన కలిగివుండే పుబ్బ నక్షత్ర జాతకులు.. విద్యాదానం, అన్నదాన సత్రాల ఏర్పాటులో అధిక శ్రద్ధ తీసుకుంటారు. దేశ, విదేశాల్లో మంచి పరిచయాలు కలిగి ఉండే వీరు.. అన్యభాషలు సైతం అనర్గళంగా మాట్లాడుతారు. తన జీవిత శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాల్లో ప్రోత్సహిస్తారు. పైకి కనిపిస్తున్న జీవితం కాకుండా రహస్య జీవితం గడుపుతారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సైతం వీరి లోపాలను స్పష్టంగా చెప్పలేరు.

ఇక ఈ పుబ్బ నక్షత్ర జాతకుల అదృష్ట సంఖ్య- ఐదు,
అదృష్ట రంగు- గ్రే, మెరూన్.
అదృష్టమైన రోజు- ఆదివారం, బుధవారం మంచి ఫలితాలనిస్తాయి.
శనివారం- సామాన్య ఫలితాల నిస్తుంది.
అయితే మంగళవారం ఈ పుబ్బ నక్షత్ర జాతకులకు ఏమాత్రం కలిసిరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

లేటెస్ట్

గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి

23-06-2025 సోమవారం దినఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు

22-06-2025 ఆదివారం దినఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది....

21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

Show comments