Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది పునర్వసు నక్షత్రమా? ఐతే బంగారంపై మోజు ఎక్కువే..!

Webdunia
WD
గురుగ్రహ నక్షత్రమైన పునర్వసు నక్షత్రములో జన్మించిన జాతకులు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోని ఈ జాతకులకు బంగారపు ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉంటుందని జోతిష్య నిపుణులు అంటున్నారు.

సొంత పనుల కంటే ఇతరుల పనులను నెరవేర్చగలిగే ఈ జాతకుల, సంసార జీవితంలో మాత్రం బేధాభిప్రాయాలు ఉంటాయి. అయితే సర్దుకోవడం ద్వారా సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు తీసుకోవడం, ఇతరులను నమ్మి మోసపోవడం ఈ జాతకుల నైజం.

సమాజంలో ధైర్యం లేనివారుగా ముద్రపడినా, వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా, స్వయం శక్తితో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆయుర్వేద వైద్యం, ఎగుమతి దిగుమతులు వీరికి కలిసివస్తాయి. ఇంకా క్రీడల పట్ల ఆసక్తి, ధనూర్ విద్యల పట్ల శ్రద్ధ వహిస్తారు. అలాగే సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.

ఇకపోతే.. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన జాతకులకు ఐదు అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే పసుపు రంగు వీరికి శుభ ఫలితాలనిస్తుంది. దీంతో పసుపు రంగు చేతి రుమాలును చేతిలో ఉంచుకోవడం లేదా రోజూ ధరించే దుస్తుల్లో కాసింత పసుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిది.

ఇంకా పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అన్ని విధాల అనుకూలిస్తుంది. గురువారం సామాన్య ఫలితాలనిస్తుంది. కానీ సోమవారం వీరికి కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు సోమవారం శుభ ఫలితాలనిస్తుంది. ఆది, బుధవారాలు కూడా సామాన్య ఫలితాలనిస్తుంది. గురువారం మాత్రం ఈ జాతకులకు అనుకూలించదు.

కాగా.. 2, 11, 20, 29, 38, 47, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు వీరికి కలిసొస్తాయి. 3, 6, 8, 9 అనే సంఖ్యలతో సామాన్య ఫలితాలుంటాయి. కానీ నాలుగు మాత్రం పునర్వసు నాలుగో పాదములో పుట్టిన వారికి అనుకూలించదు. ఇదేవిధంగా తెలుపు, క్రీమ్ రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

Show comments