Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది ఆశ్లేష నక్షత్రమా? ఏదోరకంగా మీ కోరికలను నెరవేర్చుకుంటారు!

Webdunia
FILE
బుధగ్రహ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు పట్టుదలతో అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలరు. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు సుఖసంతోషాలతో జీవించాలని తీవ్రంగా శ్రమిస్తారు. భోగభాగ్యాలతో జీవించాలని భావించే వీరికి కోరికలు ఎక్కువ. అయితే ఆ కోరికలను కూడా ఏదో విధంగా తీర్చుకోగలుగుతారు.

పట్టుదల, ప్రతీకారం స్పష్టమైన భావాలను కలిగి ఉండే ఈ జాతకులు, జీవితంలో కష్టపడి సుఖవంతమైన జీవితం ఏర్పరుచుకుంటారు. అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండే ఈ జాతకుల జీవితం ఎల్లప్పుడు స్థిరంగా నడుస్తుంది.

అలాగే.. వయస్సు గడుస్తున్న కొద్ది సుఖవంతమైన జీవితానికి దగ్గరవుతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును కలిగి ఉంటారు. కానీ నమ్మక ద్రోహులు స్నేహితులు కావడం వీరికి దురదృష్టకరంగా పరణమిస్తుంది.

ఇంకా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు వస్త్ర వ్యాపారం, పాల వ్యాపారం, కాంట్రాక్టులు, పెట్రోలు బంకులు, రియల్ ఎస్టేట్ వంటివి లాభిస్తాయి. అర్హులైన వారికి దానం చేయడం వీరి నైజం. కానీ సంతాన పరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి సంతానం బాగోగులపై అధికశ్రద్ధ వహించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే స్నేహితుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం ద్వారా సమస్యలకు దూరమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే.. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు సోమవారం అన్న విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు గురువారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా 2,7 సంఖ్యలు వీరికి అనుకూలిస్తాయి. ఇంకా 2, 11, 20, 29, 38, 47, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు కూడా వీరికి శుభ ఫలితాలను అందజేస్తాయి.

మరోవైపు.. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి సిల్వర్, క్రీమ్ మరియు తెలుపు రంగులు అనుకూలిస్తాయి. ఈ రంగులు కలిసిన దుస్తులను ధరించడం ద్వారా మానసిక ఉల్లాసం, ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా ఈ జాతకులు తెలుపు రంగు చేతిరుమాలును వాడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Show comments