Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్వసు-ఆశ్లేష వరకు నక్షత్ర శాంతులు, విశేషాలు

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2008 (17:37 IST)
పునర్వసు - ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. శుభకరం. అబ్బాయి పుడితే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు, అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు. అమ్మాయి అయితే శాంత స్వభావంతో, బంధువులయందు ఎక్కువ ప్రేమ చూపేది, ఓర్పు కలిగినదిగా, ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. ధనవంతురాలు అవుతుంది.

పుష్యమి - మొదటి పాదములో పుత్రికా పుత్రులు పుట్టినట్లైతే మేనమామకు దోషము కలుగుతుంది. రెండు, మూడు పాదాలలో పుత్రికా పుత్రులు పుడితే తల్లిదండ్రులకు దోషము. ఈ దోష శాంతికి మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, గంధపు చెక్క దానము మొదలైనవి చేయించాలి.

నాల్గో పాదంలో జన్మించిన వారికి దోషము లేదు. అయినా నక్షత్రము దోషమైనట్లైతే సామాన్య శాంతి, శిశువు యొక్క ముఖాన్ని మంత్రాలతో కూడిన నూనెలో తండ్రి చూడాలి. అబ్బాయి పుడితే బలవంతుడుగా, మిక్కిలి కామం గలవాడిగా, స్థిరబుద్ధి గలవాడుగా, పరిశుద్ధుడుగా, విద్యయందు సమర్థుడుగా, ధైర్యము చాలనివాడుగా అవుతాడు. అమ్మాయి పుడితే, రూపవతి, ధార్మికురాలు, దేవబ్రాహ్మణ భక్తి కలిగినదిగా, ఐశ్వర్యవంతురాలుగా, అదృష్టవంతురాలుగా అవుతుంది.

ఆశ్లేష - మొదటి పాదంలో అబ్బాయి, లేదా అమ్మాయి పుట్టినా దోషం లేదు. శుభం. రెండవ పాదంలో పుత్ర, పుత్రికా జననమైన ధనానికి, తండ్రికి దోషం వస్తుంది. మూడవ పాదంలో పుత్ర, పుత్రికా జననమైతే తల్లికి దోషము. నాల్గవ పాదంలో పుత్ర, పుత్రికా జననమైతే తండ్రికి, ఆ శిశువుకు దోషము వస్తుంది. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారికి సామాన్య శాంతిని, శిశువు ముఖాన్ని మంత్రాలతో కూడిన నూనెలో తండ్రి చూడాలి.

రెండు, మూడు, నాలుగు పాదాలలో పుట్టిన వారికి మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర, నవగ్రహాలకు దానాలు, సువర్ణ దానం చేయించాలి. అబ్బాయి పుడితే సౌందర్యవంతుడు, మంచి సౌభాగ్యము గలవాడు, క్రూరుడు, పర స్త్రీలందు ఆసక్తి కలవాడు, రహస్యంగా రతులు చేయువాడు, చక్కగా మాటలు చెప్పనేర్చినవాడు, వ్యసనాలకు లోబడేవాడుగా అవుతాడు. అదే అమ్మాయి అయితే డంబముగా మాట్లాడును, కలహ ప్రియురాలు, క్రూర స్వభావము కలిగినదిగా అవుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

Show comments