Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహ భుక్తి దశా కాలాలు - ఫలితాలేంటో తెలుసా!?

Webdunia
FILE
కేతు దశాకాలం ఏడు సంవత్సరాలు. ఇందులో స్వయభుక్తిగా వ్యవహరిస్తున్నకేతు భుక్తీ కాలం నాలుగు నెలల 27 రోజులు . ఈ స్వయభుక్తి కాలం మంచి యోగాలను ప్రసాదించవు. సమస్యలతో కూడిన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాధులు ఏర్పడుతాయి. స్నేహితులు శత్రువులవుతారు.

శుక్ర భుక్తి- ఈ భుక్తి కాలం ఏడాది రెండు నెలలు. ఈ కాలంలో సొమ్ములు తొలగిపోయే పరిస్థితులు నెలకొంటాయి. అయితే ప్రభుత్వ మార్గం ద్వారా సహాయాలు లభించి జీవితంలో అభివృద్ది పరిస్థితులు ఏర్పడుతాయి. భాగస్వాముల సహచరణతో సంతోషాలు నెలకొంటాయి.

సూర్య భుక్తి- దీని కాలం నాలుగు నెలల ఐదురోజులు. ఈ కాలంలో అగ్నివలన సమస్యలు ఏర్పడుతాయి. పిశాచముల వంటి భయానిక పరిస్థితులకు గురవుతారు. తండ్రికి ఆరోగ్యకరం కాస్త దెబ్బతినటం జరగుతాయి. అదనపు ఖర్చులు ఏర్పడతాయి. వ్యాధుల వలన అధిక ఖర్చులు ఏర్పడతాయి.

చంద్ర భుక్తి- ఈ భుక్తి కాలం ఏడు నెలలు. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఏర్పడతాయి. అంతేగాకుండా భార్య భర్త మాటలను వినని పరిస్థితులు నెలకొంటాయి. కష్టపడి సంపాదించిన ఆస్తులకు నష్టం వాటిల్లుతాయి.

కుజభుక్తి- ఈ భుక్తీశుని కాలం నాలుగునెలల 27రోజులు . ఈ కాలంలో సోదరుల మధ్య వాదనలు పెరిగి విరోధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఏర్పడే కొన్నిసమస్యల వలన బంధు వర్గాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.

రాహు భుక్తి- ఈ భుక్తీ కాలం ఏడాది 18 రోజులు. ఆరోగ్యంలో లోటుపాట్లు ఏర్పడతాయి. కులదైవ పూజలు చేయటం వంటివి పాటించాలి. కులదైవాలు మంచి ఫలితాలను అందజేయని కాలం. విరోధం, దోపిడీల భయం ఏర్పడతాయి. భార్యకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి.

గురు భుక్తి- ఈ భుక్తి కాలం 11నెలల కాలం ఆరురోజులు. గురుభుక్తి వలన మంచి ఫలాలు ఆశించటం చేయొచ్చు. మంచి యోగాలు చేకూరుతాయి. కొందరికి వారి ఇష్టానుసారం భాగస్వాములు లభిస్తారు. ప్రభుత్వం ద్వారా మంతి అవకాశాలు లభిస్తాయి.

శనిభుక్తి- ఈ భుక్తీ కాలం ఏడాది నెలాతొమ్మిది రోజులు. ఈ కాలంలో మంచి ఫలాలు లభించవు. భార్యాసంతానాలను కొద్దిరోజులకు విడిపోయే ఆస్కారాలున్నాయి. మనస్సులో కలత ఎల్లప్పడూ చోటు చేసుకుంటోంది.

బుధ భుక్తి- ఈ భుక్తీ కాలం 11 నెలల 27 రోజులు . ఈ కాలంలో మంచి ఫలాలు చేకూరుతాయి. అంతేగాక కీర్తి ప్రతిష్టలు అందుతాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంతో ఆభరణాలు లభించటం, వస్తు సేకరణ లభించటం వంటివి చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Show comments